రాష్ట్రీయం

కడప ఉక్కుకు 6 నెలల్లో శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన ఉక్కు పరిశ్రమకు కడపలో ఆరు నెలల్లో శంకుస్థాపన చేస్తామని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. రెండేళ్లలో కడప ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం కడపలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలోని యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రెండేళ్లలో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిచేసి 75శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మైనార్టీల సంక్షేమానికి ఎంతగానో పాటుపడ్డారన్నారు. కడప జిల్లా వైఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. గతంలో రాజశేఖరరెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించగా, ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ అదే బాటలో నడిచి సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వచ్చి జనరంజకంగా పాలన సాగిస్తారన్నారు. మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల ఉన్నతికి ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. మంత్రి మండలిలో 60 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే స్థానం కల్పించారన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా అణగారినవర్గాలకే అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారని అంజాద్‌బాషా అన్నారు. అన్నివర్గాల ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని, ముఖ్యమంత్రి జగన్‌ను ఆశీర్వదిస్తున్నారని అన్నారు. తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు మేలుకలిగే నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. సామాన్యుడినైన తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మరోసారి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.
చిత్రం... కడపలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా