రాష్ట్రీయం

ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన వికారాబాద్ వాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: ప్రపంచంలోనే ఎత్తు అయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వికారాబాద్ జిల్లా ఎల్లకొండ గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డిని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అభినందించారు. టీఆర్‌ఎస్ విభజన విభాగం అధ్యక్షుడు నందు, తిరుపతిని కేటీఆర్ వద్దకు తీసుకవచ్చారు. తాను ఎరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి స్థానికులు రూ. 3 లక్షలు ఇచ్చిన తనను ప్రోత్సహించినట్టు వివరించారు. అలాగే శంకర్‌పల్లి మాజీ సర్పంచ్ ఆత్మలింగం రూ.11.5 లక్షలు, బిడిఎల్ విన్నర్స్ పౌండేషన్ సంస్థ మరింత కొంత ఆర్థిక సహాయాన్ని అందించినట్టు వివరించారు. సాహోసోపేతంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం అభినందనీయమని కేటీఆర్ అభినందించారు.
చిత్రం... ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన తిరుపతిరెడ్డిని అభినందిస్తున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్