రాష్ట్రీయం

13న తీరం దాటనున్న తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 11: అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను తీవ్ర తుపానుగా మారి 13న ఉదయం తీరం దాటనుంది. ప్రస్తుతం గోవాకు పశ్చిమ వాయువ్యంగా 350 కిలోమీటర్లు, వరైవాల్‌కు దక్షిణ నైరుతి దిశగా 530 కిమీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఇది 13న ఉదయం వరైవాల్ సమీపంలో తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో నైరుతి రుతుపవనాల గమనం మందగించగా, మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రాన్ని పలకరించే అవకాశం ఉంది. అయితే దక్షిణ కోస్తాలో వేడిగాలుల తీవ్రత పెరిగింది. మరో రెండు రోజుల పాటు వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా పరిధిలో మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. కావలిలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా సాధారణం కంటే 6 డిగ్రీలు అధికం. నెల్లూరు, ఒంగోలులో 43 డిగ్రీలు నమోదు కాగా, సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం, గన్నవరంలో 42 డిగ్రీలు కాగా, సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం. మచిలీపట్నం, కాకినాడలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం.