రాష్ట్రీయం

జనవరి 10 నాటికే సిలబస్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. బుధవారం నుండి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను ఆవిష్కరించింది. విద్యాసంవత్సరంలో స్కూళ్లు మొత్తం 232 రోజులు పనిచేయనున్నాయి. సిలబస్ పూర్తి, పరీక్షల నిర్వహణ, సెలవులను ఈ క్యాలెండర్‌లో విద్యాశాఖ వివరించింది. పదో తరగతి విద్యార్థులకు జనవరి 10 నాటికి సిలబస్‌ను పూర్తి చేస్తారు. ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకూ ఫిబ్రవరి 29 వరకూ సిలబస్ బోధన పూర్తి చేస్తారు. జూలై 31 నాటికి ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)-1 , సెప్టెంబర్ 27 నాటికి ఎఫ్‌ఏ -2 పూర్తి చేస్తారు. అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 26 వరకూ సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ) -1 పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 7 నుండి ఏప్రిల్ 16 వరకూ ఎస్‌ఏ-2 పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 29 నాటికి పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 13 వరకూ దసరా సెలవులు ఇస్తారు. మిషనరీ పాఠశాలలకు మాత్రం డిసెంబర్ 22 నుండి 28 వరకూ ఏడు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఇస్తారు. జనవరి 11 నుండి 16 వరకూ ఆరు రోజుల పాటు సంక్రాంతి సెలవులు మంజూరు చేస్తారు. ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకూ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తారు. తదుపరి పున:ప్రారంభం జూన్ 12న జరుగుతుందని క్యాలెండర్‌లో అధికారులు పేర్కొన్నారు. వీటికి తోడు గేమ్స్ , స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను ఆగస్టు 3వవారంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో సెప్టెంబర్ 3 వారంలో, జోనల్ స్థాయిలో ఆగస్టు మూడో వారంలో నిర్వహిస్తారు.
హైస్కూళ్లు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 గంటల వరకూ, యూపీ స్కూళ్లు 9 గంటల నుండి సాయంత్రం 4.15 గంటల వరకూ, ప్రైమరీ స్కూళ్లు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకూ పనిచేస్తాయి. టెన్త్ క్లాసు వారికి ఉదయం 10.45 గంటలకు, 9వ తరగతి వారికి 11.40 గంటలకు, 8వ తరగతి వారికి సాయంత్రం 1.50 గంటలకు, ఏడో తరగతి వారికి సాయంత్రం 2.40 గంటలకు, ఆరో తరగతి వారికి సాయంత్రం 3.35 గంటలకు డిజిటల్ క్లాసులు ఉంటాయి.