రాష్ట్రీయం

పాఠశాలల నిధులు ప్రభుత్వ ఖాతాకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: పాఠశాలలకు కావల్సిన కనీస సౌకర్యాల కల్పన కోసం సర్వశిక్షా అభియాన్ నుండి విడుదల చేసిన నిర్వహణ గ్రాంట్, పాఠశాలల గ్రాంట్ 350 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి తమ ఖాతాలకు మళ్లించుకుంది. పాఠశాలలకు సంబంధించిన అన్ని పనులనూ ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని నిర్బంధం చేస్తున్న ప్రభుత్వం నిజానికి అన్ని స్కూళ్లలో ఇంటర్‌నెట్ ఆన్‌లైన్ కనెక్షన్లు ఉన్నాయో లేదో, ఆన్‌లైన్ కనెక్షన్ ద్వారా అప్‌డేట్‌కు అవసరమైన సౌకర్యాలు ఎంత మేరకు ఉన్నాయో పరిశీలించాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. చైల్డ్ ఇన్ ఫో, ఎన్‌జిసి (నాటిన మొక్కల వివరాలను ఆన్‌లైన్‌లో అప్ డేట్ చేయడం) , పేరెంట్స్ ఫోన్ నెంబరు నమోదు, ఎస్‌ఎస్‌సి ఐసిఆర్ దరఖాస్తుల అప్‌డేషన్, యుడైస్ వివరాలను అప్‌డేట్ చేయడం వంటి విధులు ఎన్ని చెబుతున్నా వాటికి నిధులు మాత్రం ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. డిఎస్‌ఇ నియామకాలు వెంటనే జరిపి, ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంటుంది. పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను పునరుద్ధరించాల్సి ఉన్నా ఆ విషయంలోనూ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉపాధ్యాయ సంఘాల నుండి వినవస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలపైనా, ఉపాధ్యాయులపైనా ప్రభుత్వాధినేత మొదలు దిగువస్థాయి అధికారుల వరకూ అంతా దుష్ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ వెంకటేశ్వరరావు, పి బాబురెడ్డిలు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడం తప్పుకాదని, అయితే బహిరంగంగా ఉపాధ్యాయులను , పాఠశాలలను విమర్శించడం వల్ల ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పోతుందని అన్నారు. తగినంత ఉపాధ్యాయులు, వసతులు ఉన్నచోట మంచి ఫలితాలను సాధించగలుగుతామని , ఉన్న అభివృద్ధిని చూడకుండా ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించే పద్ధతి సరికాదని వారు పేర్కొన్నారు. ఆదర్శప్రాధమిక పాఠశాలలకు ఇస్తామంటున్న గ్రాంట్‌ను వెంటనే విడుదల చేసి స్కూళ్లకు కావల్సిన సౌకర్యాలను కల్పించాలని అన్నారు. స్కూళ్లలో డిజిటల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని, యాజమాన్య కమిటీలను తక్షణమే నియమించాలని చెప్పారు.