రాష్ట్రీయం

కాళేశ్వరం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే సమయం ఆసన్నమైంది. గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయనున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలి దశకు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. తమ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించగా ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. అయితే, తానే స్వయంగా ముంబాయికి వచ్చి ఆహ్వాన పత్రాన్ని అందజేయనున్నట్టు ఫడ్నవీస్‌కు తెలుపగా ఆయన స్వాగతించారు. ఇలా ఉండగా ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కూడా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని కేసీఆర్ అధికారికంగా వెల్లడించకనప్పటికీ జగన్‌తో కూడా ఫోన్లో మాట్లాడిన అనంతరం అమరవాతికి స్వయంగా వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నట్టు సమాచారం. ఇలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ ప్రారంభానికి ముందే ఈ నెల 4న రాంపూర్ పంప్ హౌజ్ నిర్మాణ పనులను, మేడిగడ్డ బ్యారేజి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించి వచ్చారు. ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించడానికి అనుగుణంగా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిందిగా నిర్మాణ పనులు చేపట్టిన వర్క్ ఏజెన్సీలను, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు తొలి దశలో రోజుకు రెండు టీఎంసీల నీటిని గోదావరి నుంచి బ్యారేజిలోకి ఎత్తిపోయనున్నారు. ఆ తర్వాత రెండవ వచ్చే ఏడాది నుంచి మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసే లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ప్రాజెక్టు పనుల పరిశీలన తర్వాత తెలంగాణ రైతుల చిరకాల స్వప్నం త్వరలోనే సాకారం కాబోతుందని సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా మేడిగడ్డ బ్యారేజికి ఇప్పటికే 85 గేట్ల బిగింపు పూర్తి అయింది. అలాగే బ్యారేజి నుంచి చుక్కనీరు పోకుండా బిగించే రబ్బర్ సీలింగ్ కూడా పూర్తి అయింది. ప్రాణహిత నుంచి వచ్చే నీటిని మేడిగడ్డ బ్యారేజికి తరలించి అక్కడి నుంచి కనె్నపల్లి పంప్‌హౌస్‌కు, అన్నారం బ్యారేజిలోకి, అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజిలోకి రివర్స్ పంపింగ్ చేయడానికి పంపుహౌస్‌ల నిర్మాణం కూడా ప్రారంభోత్సవానికల్లా పూర్తి చేయడానికి కార్మికులు రేయంబవళ్లు పనులు నిర్వహిస్తున్నారు. నీటిని ఎత్తిపోయనున్న పంపుల వెట్ రన్, ట్రయల్ రన్ కూడా ఇప్పటికే పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి కాళేశ్వరం సిద్ధమైంది.

చిత్రాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా వెట్న్ నిర్వహిస్తున్న దృశ్యం

*ఇన్‌సెట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం (ఫైల్)