రాష్ట్రీయం

ఎక్కడి లారీలు అక్కడే గప్‌చుప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: ఇసుక తవ్వకాలు, రవాణాపై ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో బుధవారం నుండి ఎక్కడి లారీలు అక్కడే గప్‌చుప్ మాదిరిగా మాయం అయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి తీరం ఉన్న ప్రాంతాల్లో నిత్యం పగలూ రాత్రి తేడా లేకుండా ఇసుక లారీలు దూసుకుపోతుండేవి. తాజా నిషేధాజ్ఞలతో అవి నిలిచిపోయాయి. అయితే వరదలు వస్తాయనే ముందుజాగ్రత్తతో పలు ప్రాంతాల్లో నిబంధనలకు కొండల మాదిరిగా ఇసుక నిల్వలు పెట్టారు. వాటి సంగతేంటనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం రూపకల్పనలో భాగంగా ఇప్పటివరకు ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దుచేసింది. ఇసుక తవ్వకాలు ఎక్కడికక్కడ నిలిపివేయాలని ఆదేశాలుజారీచేసింది. ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ర్యాంపుల్లో తవ్వకాలు దాదాపుగా నిలిచిపోయాయి. అయితే సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యి, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే లోపు గోదావరి జిల్లాల్లో ఇసుక అక్రమార్కులు పేట్రేగిపోయారు. పగలూ రాత్రి తేడా లేకుండా యంత్రాలతో ఇసుక తవ్వి, తరలించేశారు. కొత్త ప్రభుత్వం కొత్త విధానాన్ని ముందుగానే పసిగట్టిన అక్రమార్కులు ఖాళీ ప్రదేశాల్లో భారీగా ఇసుక నిల్వలు పెట్టారు. దీనికి తోడు రానున్నది వర్షాకాలం, వరదల సీజను కావడంతో ఇసుకకు ఉండే డిమాండును దృష్టిలో ఉంచుకుని మరింతగా నిల్వలు పెట్టేశారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నుంచి సీతానగరం వైపు వెళ్లే రోడ్డంతా రానూ, పోనూ ఇసుక భారీ లారీలు, టిప్పర్లతో రద్దీగా కిటకిటలాడిపోయేది. వాస్తవానికి ఇసుకను ఎప్పటికపుడు కావాల్సిన రీతిలో రవాణా చేయడమే తప్ప మిషనరీని వినియోగించి నిల్వ చేయడం అక్రమం. తిలాపాపం తలాపిడికెడు చందంగా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో యథేచ్ఛగా అక్రమ నిల్వలు పేరుకుపోయాయి. ఇసుక తవ్వకాలకు అనుమతులు మంజూరుచేసే కొన్ని కార్యాలయాల్లో చిరుద్యోగులు సైతం కోట్లకు పడగలెత్తారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాటవరం, సీతానగరం, ముగ్గళ్ల, మునికూడలి, రఘుదేవపురం, వెదుళ్లపల్లి, వంగలపూడి, జొన్నాడ తదితర ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా నిల్వచేశారు. రాత్రి సమయాల్లో తరలింపు సాగిస్తున్నారు. మరో వైపు పట్టా భూముల్లో ఇసుక తొలగించడానికి అనుమతులు తీసుకుని పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు చేశారు. ప్రభుత్వం ఈ అక్రమ నిల్వలపై కూడా కొరడా ఝుళిపించాలని ప్రజలు కోరుతున్నారు.