రాష్ట్రీయం

మీరు సక్కగుంటే.. మేమెందుకు పోతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. గ్రూపు రాజకీయాలతో సతమతవౌతోంది. మరోవైపు కొత్త నాయకత్వం ఎదగకుండా పార్టీ సీనియర్లే అణచివేస్తున్నారు. కాంగ్రెస్‌లో కొనసాగితే భవిష్యత్‌కు భరోసా లేదనే పార్టీని విభేదించి టీఆర్‌ఎస్‌లో చేరాం’ అని పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనం రాజ్యాంగబద్ధంగానే జరిగిందన్నారు. విలీనంపై పదవ షెడ్యూల్‌లో స్పష్టంగా ఉందన్నారు. పదో షెడ్యూల్‌లో ఏముందో కాంగ్రెస్ నేతలకు తెలియదా? చదువు రాదా? అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లో విలీనమై తామేదో అమ్ముడు పోయినట్టు విమర్శిస్తున్నారు, అమ్ముడు పోవడానికి బర్రెలం, గొర్రెలం కాదు అని మండిపడ్డారు. తమపై చిల్లరగా మాట్లాడితే పరువు నష్టం దావా వేసి కోర్టు కీడుస్తామని వారు హెచ్చరించారు. తామేందుకు కాంగ్రెస్‌కు రాజీనామా చేశామో తాము రాసిన లేఖల్లో స్పష్టంగా తెలియజేశామన్నారు. రాజ్యాంగబద్ధంగా విలీనం జరిగాక కూడా తమను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ విలీనాన్ని కాంగ్రెస్ నాయకులు అనసరంగా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంలు అన్నారు, మరి బ్యాలెట్‌తో జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని వారు నిలదీశారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గాల్లో పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఎందుకు ఓడిపోయిందని వారు ప్రశ్నించారు. విలీనం వల్ల ఏదో జరిగిపోయినట్టు భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీక్షలంటూ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను విడుతున్నట్టు ప్రకటించిన తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించిందన్నారు. తాము నియోజకవర్గాల అభివృద్ధి కోసం పార్టీ మారడాన్ని ప్రజలు ఆమోదించడం వల్లనే పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించినట్టు స్పష్టం చేశారు. త్రిపుర, గోవాలో కూడా ఇక్కడి మాదిరిగానే విలీనాలు జరిగాయని గుర్తు చేశారు. తాము రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, అవసరమైతే చేయడానికి కూడా వెనుకాడమని స్పష్టం చేశారు. ఉత్తమ్‌కు ఎంత బలం ఉందో త్వరలో హుజుర్‌నగర్‌లో జరుగనున్న ఉప ఎన్నికల్లో తేల్చుకుందమని సవాల్ విసిరారు.
చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి