రాష్ట్రీయం

మరో నాలుగు రోజులు వడగాడ్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 12: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వడగాల్పులు తప్పవు. ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా పలు పట్టణాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దక్షిణ కోస్తాలో ఈ పరిస్థితులు మరో నాలుగు రోజులు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం రాత్రి స్పష్టం చేశారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదైనట్టు పేర్కొన్నారు. దక్షిణ కోస్తాలో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గన్నవరం 44 డిగ్రీలు, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, కావలి 44 డిగ్రీలు, తుని, కాకినాడ 42 డిగ్రీలు, నర్సాపురం 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.