రాష్ట్రీయం

ఆర్టీసీ విలీన ప్రక్రియ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ లభించడంతో గురువారం నుంచి జరుప తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీలో సీఎం చాంబర్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఆర్టీసీ జేఏసీ నేతలు బుధవారం సమావేశమయ్యారు. కమిటీ వేసి విలీనం ప్రక్రియ వేగవంతం చేసేందుకు నిర్ణయించడంతో ముఖ్యమంత్రికి జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ విలీనం ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఇకపై మీరు ఆర్టీసీ ఉద్యోగులు కాదని, ప్రభుత్వ ఉద్యోగులు అని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ నష్టాల గురించి కార్మిక సంఘాల నేతలు ప్రస్తావించగా, ఆర్టీసీ అప్పుల సంగతి తనకు వదిలేయమన్నారు. ఆర్టీసీ సమస్యలు ఇక ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఆర్టీసీని ఆధునీకరిస్తామని, ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దుతామన్నారు. మూడు నెలల్లో విలీన ప్రక్రియను కొలిక్కి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ విలీనం తదితర సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించడంతో గురువారం నుంచి తాము తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు జేఏసీ నేతలు మీడియాకు వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని, ధైర్యంగా ఉండాలని సీఎం తెలిపారన్నారు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మంత్రి, సీఎస్‌తో మాట్లాడాలని చెప్పారన్నారు. తాము ఇచ్చిన 27 డిమాండ్లను పరిష్కరించేందుకు యాజమాన్యం రాతపూర్వకంగా ఒప్పందం చేసుకుందని తెలిపారు.
చిత్రం...ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన ఆర్టీసీ జేఏసీ నేతలు