ఆంధ్రప్రదేశ్‌

తొలిసారి ఉమ్మడి ప్రశ్నపత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 12: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ 6 నుండి 9వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఉమ్మడి ప్రశ్నాపత్రాన్ని ప్రవేశపెట్టింది. మంగళవారం నుంచి ప్రారంభమైన పరీక్షలకు ఈ ఉమ్మడి ప్రశ్నాపత్రం విధానం అమలుచేస్తున్నారు. తొలిసారిగా ఎస్‌ఇఆర్‌టి ప్రశ్నాపత్రాలను అన్ని తరగతులకు అమలుచేశారు. ఇప్పటివరకు జిల్లాల స్ధాయిల్లో ప్రశ్నాపత్రాల రూపకల్పనచేసి, డిసిఇ బోర్డు ద్వారా అందచేసేవారు. ఇక ప్రైవేటు యాజమాన్యాలు సొంత ప్రశ్నాపత్రాల్నే అమలుచేసేవారు. ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ స్వస్తి పలికింది. గత కొన్ని మాసాలుగా ఉమ్మడి ప్రశ్నాపత్రాల అమలుపై జరుగుతున్న చర్చకు మంగళవారం నుంచి ప్రారంభమైన పరీక్షల ద్వారా ప్రభుత్వం తెరదించింది. తొలిసారిగా పరీక్షల్లో సమగ్ర మూల్యంకన విధానం (సిసిఇ) అమల్లోకి రానుంది. సిసిఇ అమలుతో తరగతుల బోధన ఎలా ఉందన్నది తెలుసుకునే అవకాశం కలుగుతుంది. పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని తొలిసారిగా ఈ తరహాలో తొమ్మిదవ తరగతి పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గతేడాది ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలుచేయగా, ఈ ఏడాది నుంచి అన్ని జిల్లాల్లో ఇదే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే హిందీ పరీక్ష మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు రెండు పేపర్లు చొప్పున పరీక్షలు జరుగుతాయి.

సాగర్‌లో భారీగా తగ్గిన విద్యుత్ ఉత్పత్తి

విజయపురిసౌత్, ఏప్రిల్ 12: నాగార్జున సాగర్‌లోని ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అతి స్వల్పంగా విద్యుత్ ఉత్పాదన జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు వెలుగును అందిస్తున్న సాగర్ విద్యుత్ ఉత్పాదన కేంద్రం ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. ఈ ఏడాది నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతం నుండి అతి తక్కువగా వరదనీరు రావడమే ప్రధాన కారణమని జన్‌కో అధికారులు చెబుతున్నారు. దీంతో సాగర్ జలాశయం మంచినీటి అవసరాలు తీర్చడానికే పరిమితమైంది. సాగర్ కుడి, ఎడమ కాలువలకు కృష్ణాడెల్టా ప్రాంతానికి ఈ ఏడాది సాగునీటిని మాత్రమే అందించారు. సాగర్ ప్రాజెక్టు నుండి ఇప్పటి వరకు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 18 టీయంసీల నీటిని మాత్రమే విడుదల చేశారు. దీంతో ఎన్నడూ లేనంత అతి తక్కువగా ఏ ఏడాది 93.411మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్తత్పి జరిగింది. 2010-11 సంవత్సరంలో 1298.555 మిలియన్ల యూనిట్లు, 2011-12 సంవత్సరంలో 1129.565మిలియన్ల యూనిట్లు, 2012-13 సంవత్సరంలో 255.798మిలియన్లు, 2013-14 సంవత్సరం 1350.532 మిలియన్ల యూనిట్లు, 2014-15 సంవత్సరంలో 1032.6522 మిలియన్ల యూనిట్లు, 2015-16 సంవత్సరంలో మార్చి నాటికి 93.411 మిలియన్ల యూనిట్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరిగింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలాశయం మంగళవారం నాటికి 506.8 అడుగులకు చేరుకుంది. ఎగువనవున్న శ్రీశైలం ప్రాజెక్టు నుండి సాగర్ జలాశయానికి 6080 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

పుష్కర ఘాట్ల పరిశీలన

మూడు బస్సుల్లో నదీ తీరంలో అధికారుల పర్యటన

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 12: కృష్ణా పుష్కరాలకు సంబంధించి కృష్ణా నదీ తీరంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ఘాట్ల నిర్మాణం, పాత వాటిని పునరుద్ధరించడం అన్నింటికీ సమీప గ్రామాల నుంచి అప్రోచ్ రోడ్ల నిర్మణాలకు సంబంధించిన ప్రతిపాదనల తయారీలో కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ బాబు ఎ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, అదనపు పోలీసు కమిషనర్ మహేష్ చంద్రలడ్డా వివిధ శాఖలకు చెందిన మరో 60 మంది ఉన్నతాధికారులు మంగళవారం మూడు ఆర్టీసీ బస్సుల్లో కృష్ణాతీరంలో ప్రకాశం బ్యారేజీ దిగువన పర్యటించారు. ప్రధానంగా పలు గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు విజయవాడ నుంచి అవనిగడ్డ వరకు కరక్టపై ఆర్టీసీ తరపున మినీ బస్సులను నడిపించేందుకు తగు చర్యలు తీసుకోగలమంటూ కలెక్టర్ హామీనిచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద చేపట్టాల్సిన పనులపై అధికారులు ఇప్పటికే చేసిన ప్రతిపాదనలన్నింటినీ కలెక్టర్ పరిశీలించారు. అవసరంలేని కొన్ని ప్రతిపాదనలను కలెక్టర్ తొలగిస్తూ ముఖ్యంగా పుష్కర పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేదిలేదంటూ అధికారులను హెచ్చరించారు.స్నానఘాట్లలకు అప్రోచ్‌రోడ్డును పటిష్టపరిచి గ్రావెల్ వేయాలన్నారు. అలాగే అవసరమైన చోట బాలికేడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అయితే కేవలం విడుదలయిన నిధులను ఖర్చు చేయడమే నిర్మాణాల ధ్యేయం కాదంటూ హెచ్చరించారు. అవసరం లేనిచోట నిర్మాణాలు చేపట్టేకంటే ఆ నిధులను యాత్రికులకు మరిన్ని విస్తత సేవలను అందించేందుకు మరో ప్రాంతంలో వినియోగించాలని ఆదేశించారు. పలు గ్రామాల్లో ప్రజలు కలెక్టర్‌ని కలిసి తమ సొంత అవసరాలకు ఇసుక దొరకడం లేదని ఇసుక యూనిట్‌కు నాలుగు వేలు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయగా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఎలాంటి పరిస్థితుల్లోనూ వినియోగదారులందరికీ లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నదీ తీరంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ బాబు