రాష్ట్రీయం

శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సులు అనుమతించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 13: తిరుమల శ్రీవారి దర్శనానికి విఐపి బ్రేక్ దర్శనాలకు శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీవారికి నిర్వహించే అభిషేకం, ఇతర సేవల కారణాల వలన సంవత్సరం పొడవునా ప్రతి శుక్రవారం రోజున విఐపీ బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖలకే పరిమితం చేస్తున్నామని, ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరింబోమన్నారు. అదే విధంగా గతంలో నిర్ణయించిన మేరకు వేసవి రద్దీ దృష్ట్యా ఏప్రిల్ 15 నుండి జూలై 15వ తేదీ వరకు శని, ఆదివారాల్లో కూడా విఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలోని విఐపీలకు మాత్రమే పరిమితం చేశామని తెలిపారు. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపారు. కావున విఐపీలు, భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని టీటీడీ యాజమన్యం ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.