రాష్ట్రీయం

శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ట్భాషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 14: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులు పాటు జరగనున్న జ్యేష్ఠ్భాషేకం శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కళ్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం రుత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు. శతకలశప్రతిష్ట ఆవాహన, నవకలశ ప్రతిష్ట ఆవాహన, కంకణ ప్రతిష్ట అనంతరం స్వామి అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు పంచసూక్తాలు పఠిస్తుండగా పంచామృతాలతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. కాగా సాయంత్రం 4 నుండి 5గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరించారు.
సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఇదిలా ఉండగా శనివార ముత్యపు కవచంతో, ఆదివారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. జ్యేష్ట్భాషేకం కారణంగా శుక్రవారం నిజపాద దర్శనం, వసంతోత్సవం, ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, పెద్దజీయ్యర్‌స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.