తెలంగాణ

వెళ్లినవారిని మళ్లీ రానివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: రాజకీయలబ్ధి కోసం కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరిన నాయకులను మళ్లీ రానిచ్చే ప్రసక్తే లేదని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఫిరాయింపుదారులకు అధికారమే ముఖ్యమని ఆయన విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం టి.పిసిసి ఏర్పాటు చేసిన సభకు దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఫిరాయింపుదారులకు కాంగ్రెస్‌లో తలుపులు మూసేశామని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని తెలుసుకుని వారు మళ్లీ వెనక్కి వస్తామన్న చేర్చుకునేది లేదని తేల్చిచెప్పారు. దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని, లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోం మంత్రి, రాష్టప్రతి తదితర కీలక పదవులతో దళితులను గౌరవించిన ఘనత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకే దక్కుతుందన్నా రు. దళితులను ఓటు బ్యాంకుగా భావించరాదని, దళితుల ఇళ్లకు వెళ్లి వారి సంక్షేమానికి కృషి చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. దళితుల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చూపిన మార్గంలో కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు.
నీటి పారుదల రంగంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిం చి ఇస్తామని ఆయన ఇచ్చిన కల్లబొల్లి హామీల గురించి కాం గ్రెస్ పార్టీ ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరిస్తామని తెలిపారు. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా దళితుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎనలేని కృషి చేసిందని, అయితే వర్సిటీల్లో దళిత విద్యార్థులకు అన్యాయం చేసిన వారి కి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి అండగా నిలిచిందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఎఐసిసి ఎస్‌సి విభాగం చైర్మన్ కొప్పుల రాజు ప్రసంగిస్తూ, అంబేద్కర్‌ను దళిత నాయకుడిగా పరిగణించడం సరికాదని, ఆయన దేశ నాయకుడని కొనియాడారు.
టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడు తూ, దళితుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ బూటకపు ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. తెరాస అధికారంలోకి రాగానే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే ఎన్నుకుంటామన్న హామీని నిలబెట్టుకోలేకపోయిన కెసిఆర్ ప్రస్తుతం అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ దళితుల పట్ల బూటకపు ప్రేమ ఒలకబోస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దళితులకు మూడు ఎకరాల భూమి, కెజీ నుంచి పిజీ వరకు ఉచిత విద్య అందిస్తామంటూ కెసిఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి ప్రసంగిస్తూ, జాతీయ వైతాళికుల్లో అంబేద్కర్ ఒకరని కొనియాడారు. టి.పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, కెసిఆర్‌ను ‘దళిత ద్రోహి’గా అభివర్ణించారు.
కెసిఆర్.. పిట్టల దొర : షబ్బీర్ అలీ
రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ పిట్టల దొరలా హామీలిస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ చూపించిన మార్గంతో దేశం రూపు రేఖలు మారాయని ఆయన తెలిపారు.
ఎస్‌సిల పేర్లు చెప్పి..
ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి ప్రసంగిస్తూ, ఎస్‌సిల పేర్లు చెప్పి కొంత మంది వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఎస్‌సిలను బానిసలుగా చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎస్‌సిలకు ఐఎన్‌టియుసి ఎల్లప్పు డూ అండగా ఉంటుందన్నారు. టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ప్రసంగిస్తూ ఎతె్తైన అంబేద్కర్ విగ్రహం పెట్టగానే సరిపోదని, అంబేద్కర్ చూపిన మార్గంలో దళితుల సంక్షేమానికి కృషి చేయాలని పరోక్షంగా కెసిఆర్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ప్రజా పద్దుల కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ జె.గీతారెడ్డి ప్రసంగిస్తూ, సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు ఎదురుగాలి వీచిందన్నారు.
రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ, పార్టీ నుంచి నాయకులు వెళ్ళినా కార్యకర్తలు వెళ్ళలేదని చెప్పారు. శాసనసభ ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, ఎమ్మెల్యే టి.రాంమోహన్ రెడ్డి, కంచె ఐలయ్య తదితరులు కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.

21నుండి గుట్ట గర్భాలయంలో
దర్శనాలకు బ్రేక్!

బాల ఆలయంలోనే దర్శనాలు...
నిత్య పూజలు..కైంకర్యాలు!!

ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఏప్రిల్ 12: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గర్భాలయంలో పంచనారసింహుల దర్శనాలకు ఈ నెల 21నుండి బ్రేక్ పడనుంది. కొండపై నిర్మిస్తున్న బాల ఆలయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా ఈ నెల 19నుండి 21వరకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి వారి ఆధ్వర్యంలో కవచ మూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనున్నారు. బాల ఆలయంలో లక్ష్మినరసింహుల ప్రతిష్ఠాపన, పూజల అనంతరం కొండ గుహలోని ప్రధాన గర్భాలయంలో స్వయంభూవులైన స్వామివారి దర్శనాన్ని నిలిపివేయనున్నారు. యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణ పనులు పూర్తయ్యాకే తిరిగి స్వయంభూ లక్ష్మినరసింహుల దర్శనం భక్తులకు అందుబాటులో రానుంది. ఈ నేపథ్యంలో మరో తొమ్మిది రోజులు మాత్రమే యాదాద్రిలో భక్తులకు కొండగుహలోని పంచనారసింహుల దర్శన భాగ్యం లభించనుండడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో రద్దీ అనూహ్యంగా పెరిగిపోతోంది.
ప్రధాన ఆలయం రీతిలోనే బాల ఆలయం !
యాదాద్రి బాల ఆలయాన్ని 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తుండగా ప్రధాన ఆలయాన్ని తలపించేలా సరిగ్గా అలాంటి దర్శనానుభూతి భక్తులకు కలిగేలా అద్భుత ధార్మిక, శిల్పకళాకృతులతో ఫైబర్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లతో నిర్మాణ పనులు సాగిస్తున్నారు. ఐదు అడుగుల బేస్‌మెంట్‌పై, 14 అడుగుల ఎత్తులో, 48 పిల్లర్లతో 30 మీటర్ల పొడవు, 21.81 మీటర్ల వెడల్పుతో బాల ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
వృథాగా సాగర్ జలాలు!

నాగార్జునసాగర్, ఏప్రిల్ 12: నాగార్జునసాగర్ జలాశయం నుండి లీకేజీ రూపంలో సాగర్ జలాలు లెక్కల్లోకి రాకుండా వృథాగా ఆంధ్రాకు తరలివెళ్తున్నాయి. నాగార్జునసాగర్ జలాశయంలో ఉన్న డైవర్షన్ టన్నల్ ద్వారా లీక్ అయిన జలాలు గత దశాబ్దాలుగా వృథాగా పోతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు ఎగువ నుండి వస్తున్న కృష్ణానది నీటి ప్రవాహాన్ని దారిమళ్ళించి దిగువకు విడుదల చేశారు. దీనికోసం సాగర్ డ్యాంకు సమీపంలోని ఎగువన ఒక టన్నల్‌ను ఏర్పాటు చేశారు. ఈ టనె్నల్‌లో సాగర్ జలాశయ నీటిమట్టానికి 200 అడుగుల వద్ద ఒక గేటు, 400 అడుగుల వద్ద మరో గేటును ఏర్పాటు చేశారు. డ్యాం నిర్మాణం జరిగేటప్పుడు వీటి ద్వారా నీటిని దారి మళ్ళించి డ్యాం దిగువ భాగం నుండి దిగువ కృష్ణాకు విడుదల చేసేవారు. అయితే డ్యాం నిర్మాణం పూర్తయిన తరువాత ఈ డైవర్షన్ టన్నళ్లను భవిష్యత్తులో ఉపయోగార్ధం అలాగే ఉం చారు. అయితే ఈ గేట్ల ద్వారా అప్పటి నుండి కూడా నీరు లీకై వృథాగా పోతూనే ఉంది. ఈ పరంపరలో డ్యాం నిర్మాణమైన కొన్ని సంవత్సరాలకే డైవర్షన్ టన్నల్‌లోని 200 అడుగుల వద్ద ఏర్పాటు చేసిన గేటు పూడికలో పూర్తిగా మునిగిపోగా 400 అడుగుల వద్ద ఏర్పాటుచేసిన గేటు మాత్రం ప్రస్తుతం ఉంది. నేటికీ సగటున రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున ఈ టనె్నల ద్వారా సాగర్ జలాశయం నుండి నీరు లీకై వృథాగా వెళ్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ లీకేజీ వాటర్‌ను ప్రభుత్వాలు, అధికారులు అంతగా పట్టించుకోలేదు. వేసవికాలంలో కూడా సాగర్ జలాశయంలో పూర్తిస్థాయిలో నీరు లేనటువంటి పరిస్థితులలో ఈ టనె్నల్‌లో లీకేజీ అయిన నీరు కారణంగా దిగువ భాగాన ఉన్న జంతుజాలాలకు దాహార్తి తీరుతుందని, లీకేజీ నీటిని అరికట్టడంలో ఎవరూ కూడా శ్రద్ధచూపలేదు.

ఉరేసుకుని
మెడికల్ విద్యార్థి మృతి

మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 12: మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలకు చెంది న డెంటల్ విద్యార్థి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే...రంజిత్ (22) అనే విద్యార్థి ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో బిఎస్సీ ఎంఎల్‌టి మూడ వ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్నాహ్నం 3.30 గంట ల సమయంలో చెట్టుకు వేలాడుతున్న వ్యక్తిని రహదారి గుండా వెళ్తున్న కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని చెట్టుకు వేలాడుతున్న రంజిత్‌ను కిందికి దింపగా అప్పటికే చనిపోయాడు. కళాశాల యజమాన్యానికి పోలీసులు సమాచా రం ఇచ్చారు. ఈ విషయం పై మృతుడి తల్లిదండ్రులకు సమాచా రం ఇచ్చారు. కాగా, విద్యార్థి మృత్యువాత పడడంతో ఇతర విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని రూరల్ ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు.

చౌకగా డబుల్ బెడ్ రూం ఇళ్లు

మార్గానే్వషణలో ప్రభుత్వం నేడు వర్క్‌షాప్’

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో తలెత్తిన సమస్యల నుంచి గట్టెక్కేందుకు కెసిఆర్ సర్కారు కసరత్తు ప్రారంభించిం ది. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు, ఇతర ప్రాం తాల్లో మరో లక్ష, గతంలో మం జూరు చేసిన 60వేల ఇళ్లను తక్షణం ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించిన పనులు పెద్దగా ప్రారం భం కాలేదు. గ్రేటర్‌తో పాటు అన్ని ఎన్నికల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథ కం అధికార పక్షానికి బాగా ఉపయోగపడింది. దీంతో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ పథకాన్ని అమలు చేసి తీరాల ని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూమి ఎక్కడుందనే వివరా లు సేకరిస్తున్నారు. ఒక్క గృహ నిర్మాణ శాఖకు చెం దిన భూమే నగరంలో ఎనిమిది వేల ఎకరాలు ఉంది. అదే విధం గా ఇతర శాఖలకు చెందిన భూమి వివరా లు సేకరిస్తున్నారు. నియోజక వర్గాల వారీగా భూమి వివరాలు సేకరించి ఇళ్లనిర్మాణం ప్రారంభిస్తారు. ఒకవైపు స్థలం సమస్య కాగా మరోవైపు తక్కువ ధరతో నిర్మా ణం చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముం దుకు రావడం లేదు. ఈ సమస్యలతో పాటు తక్కువ వ్యయంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలపై చర్చించేందుకు గృహ నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న సంస్థలతో గృహ నిర్మా ణ శాఖ బుధవారం హైదరాబాద్‌లో వర్క్ షాప్ నిర్వహించనుంది. తక్కువ సమయం లో ఇళ్ల నిర్మాణం చేసేందుకు ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆర్థిక సంస్థలు, బిల్డర్స్ అసోసియేషన్, రియ ల్ ఎస్టేట్ అసోసియేషన్, క్రెడాయ్, నెరెడ్కో, ఆర్కిటెక్ట్ కంపెనీలు, సాంకేతిక నిపుణులు, అధికారులతో ఈ వర్క్ షాప్ నిర్వహించనున్నారు.
అదే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలకు వివరాలు అందజేయడం కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ వర్క్‌షాప్‌లో ఆవిష్కరించనున్నారు. ఆర్థిక సహకారం అందించేందుకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, వర్క్‌షాప్‌లో అవి తమ ప్రతిపాదనలు వివరిస్తాయని మంత్రి తెలిపా రు. ఇళ్ల డిజైన్, తక్కువ ఖర్చుతో అన్ని సౌకర్యాలు కల్పించడంపై ఆర్కిటెక్ సంస్థ లు తమ ప్రతిపాదనలను ఈ వర్క్‌షాప్‌లో వెల్లడించనున్నాయి. ఈ వర్క్‌షాప్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఆర్థిక సంస్థలు, గృహ నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.