రాష్ట్రీయం

నీట్ రాష్ట్ర కోటా మెరిట్ లిస్టు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో యూజీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ ర్యాంకుల ఆధారంగా కాళోజీ నారాయణ రావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ రాష్ట్ర స్థాయి ర్యాంకులను విడుదల చేసింది. మొత్తం 33936 మందికి రాష్ట్ర ర్యాంకులను ఇచ్చింది. జనరల్ కేటగిరిలో 134 మార్కులకు మించి వచ్చిన వారికి, పీహెచ్ అభ్యర్ధులకు 120 మార్కులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 107 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. దానికి అనుగుణంగానే ర్యాంకులను ఇచ్చినట్టు యూనివర్శిటీ పేర్కొంది. ఇవి కేవలం ప్రాధమికంగా కేటాయించిన ర్యాంకులు మాత్రమేనని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత అప్పుడు తుది మెరిట్ జాబితాను రూపొందిస్తామని యూనివర్శిటీ వెల్లడించింది. తొలి ర్యాంకు నీట్‌లో ఏడో ర్యాంకు సాధించిన జీ మాధురీ రెడ్డికి దక్కింది. రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు ఎంపతి కుష్వంత్‌కు (ఆల్ ఇండియా ర్యాంకు 55), మూడో ర్యాంకు ఆరే అక్షయ్ (ఆల్ ఇండియా ర్యాంకు 59) , నాలుగో ర్యాంకు నీల వంశీకృష్ణ (ఆల్ ఇండియా ర్యాంకు 65), ఐదో ర్యాంకు నెరవాటి గగన్ (ఆల్ ఇండియా ర్యాంకు 109)కు దక్కాయి. చిట్టచివరి ర్యాంకు ఎస్టీ అభ్యర్థి నీనావత్ వినోద్ కుమార్‌కు దక్కింది. తొలి వంద ర్యాంకుల్లో 46 మంది అమ్మాయిలే కావడం గమనార్హం. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర కోటా సీట్లకు ఆన్‌లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను సైతం యూనివర్శిటీ జారీ చేయనుంది. ఇప్పటికే నీట్ జాతీయ కోటాకు అడ్మిషన్ల షెడ్యూలు విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 72, 083 మంది అర్హత సాధించారు. ఆంధ్రా నుండి 57,798 మంది రిజిస్టర్ చేసుకోగా, 39,039 మంది అర్హత సాధించారు. తెలంగాణ నుండి 51,114 మంది రిజిస్టర్ చేసుకోగా 33044 మంది అర్హత సాధించారు. గరిష్టంగా మహారాష్ట్ర నుండి 2.16 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, కేరళ నుండి 1.17 లక్షలు, కర్నాటక నుండి 1.15 లక్షలు, తమిళనాడు నుండి 1.38 లక్షలు, యుపీ నుండి 1.55 లక్షలు హాజరయ్యారు. ఆంధ్రా విద్యార్థులు సైతం దరఖాస్తు చేస్తే మెరిట్ ఆర్డర్ మారే అవకాశం ఉందని వర్శిటీ వర్గాలు పేర్కొన్నాయి.