రాష్ట్రీయం

రూ.700 కోట్లతో కొత్త వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పోలీస్‌శాఖను పటిష్టపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర హోం, జైళ్ళు, అగ్నిమాపక శాఖమంత్రి ఎండి. మహమూద్ అలీ పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయి వసతులను పోలీస్ శాఖకు ప్రభుత్వం సమకూరుస్తున్నట్లు తెలిపారు. శనివారం వరంగల్ అర్బన్ జిల్లా మామునూరులో రూ. 3కోట్ల 50లక్షలతో నిర్మించిన 4వ బెటాలియన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన అనంతరం రంగారెడ్డి, ఆదిలాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో 4 బెటాలియన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట మరో బెటాలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల పనితీరును మెరుగుపరిచేందుకు రూ 700 కోట్లతో కిత్త వాహనాలను సమకూర్చినట్లు తెలిపారు. పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్‌ను చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికే 10.501 పోలీసు కానిస్టెబుళ్ళు, 539 సబ్ ఇన్స్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. మరో 18,411 మంది పోలీస్ కానిస్టేబుళ్ళు, సబ్ ఇన్స్‌స్పెక్టర్లు, ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ స్పెషల్ పోలీసులు, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా పనిచేస్తున్నారని తెలిపారు. శాసనసభ, పార్లమెంటు, గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పనిచేశారని మంత్రి పోలీసులను అభినందించారు. రెగ్యులర్ విధులతో పాటు ప్రకృతి వైపరిత్యాలు జరిగినప్పుడు కూడా మంచి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. రూ. 300 కోట్లతో అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో హైదరాబాద్‌లో నెలకొల్పుతున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ట్రాఫిక్ వ్యవస్ధలను అనుసందానం చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచ స్ధాయి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరస్తులు,నేరాల డేటాబేసును ఇంటిలిజెన్స్ వ్యవస్ధలను కమ్యూనికేషన్ సిస్టంతో జతపర్చనున్నట్లు తెలిపారు. ఈ వ్యవస్ధ వలన పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ మున్సిపల్, ఫైర్, రోడ్లు, భవనాల తదితర శాఖలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో 6 లక్షల సీసీ కెమెరాలను, జిల్లాల్లో 50 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండా ప్రకాష్‌రావు, పార్లమెంటు సభ్యులు పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని, రాష్ట్ర స్పెషల్ పోలీసు బెటాలియన్ అడిషనల్ డీజీ అభిలాష్ బిస్తీ, సీసీ రవీందర్, సంయక్తు కలెక్టర్ దయానంద్, డీఆర్డీవో వెంకారెడ్డి, 4వ బెటాలియన్ కమాండెంట్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు.. వరంగల్ మామునూర్‌లో కమాండ్ కంట్రోల్‌ను ప్రారంభిస్తున్న హోం మంత్రి మహమూద్ అలీ
*హోంమంత్రికి గౌరవ వందనం చేస్తున్న పోలీసులు