రాష్ట్రీయం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిసిన గురుకుల విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో గురుకులాల్లో చదువుతున్న 93 మంది విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చాయని కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. అఖిల భారత స్థాయిలో ఎస్టీ కేటగిరిలో వీ వెంకటేష్‌కు 23వ ర్యాంకు, కే శ్రీనివాస్ కళ్యాణ్‌కు 156, రాథోడ్ ఆనంద్ కిశోర్‌కు 205, బీ అమర్‌సింగ్‌కు 258, ధరావత్ జగదీష్‌కు 290, హెచ్ హేమంత్‌కు 401, ఎస్సీ కేటగిరిలో విద్వాన్ గగన్‌కు 847 ర్యాంకు, డీ ప్రవీణ్‌కుమార్‌కు 1770, రజనీకేశ్ వర్ధన్‌కు 1770, హరీశ్వర్ 1797, రవికి 1920, జీ ప్రియాంకకు 2846 ర్యాంకు దక్కాయని చెప్పారు. మంచి ర్యాంకులు సాధించిన వారిలో 20 మంది సాంఘిక గురుకులాలు, 27 గిరిజన గురుకులాల్లో చదువుకున్న వారున్నారని అన్నారు.
డీసెట్ సర్ట్ఫికెట్ల పరిశీలన
డీసెట్‌లో అర్హత సాధించిన వారు జూన్ 20 నుండి 22 వరకూ సర్ట్ఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని కన్వీనర్ ఎ సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సర్ట్ఫికేట్ల పరిశీలన అనంతరం వారు తమ వెబ్ ఆప్షన్లను 25వ తేదీలోగా నమోదు చేయాలని చెప్పారు.
క్లాట్‌లో ప్రతిభ
క్లాట్ ఫలితాల్లో ఎన్టీఆర్ జూనియర్ డిగ్రీ కాలేజీల విద్యార్ధులు ఉత్తమ ర్యాంకులను సాధించారు. జాతీయ స్థాయిలో ఎస్ దేదీప్య మూడో ర్యాంకును , ప్రణీత రాథోడ్ 11వ ర్యాంకును సాధించారు. మొదటిదశలోనే తమ విద్యార్థులు 21 మందికి సీట్లు వచ్చాయని సీఓఓ మోహన్‌రావు తెలిపారు. తెలంగాణ లాసెట్‌లోనూ తొలి వంద ర్యాంకుల్లో 25 ర్యాంకులు తమ విద్యార్థులకు దక్కాయని చెప్పారు.
ఏఐఎస్‌ఎఫ్ ధర్నా
ప్రభుత్వ గుర్తింపు లేకుండా మాదాపూర్‌లో కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న స్కూళ్ల ముందు ఎఐఎస్‌ఎఫ్ ధర్నా నిర్వహించినట్టు ప్రధానకార్యదర్శి రావి శివరామకృష్ణ చెప్పారు. అనుమతిలేకుండానే కియోస్పార్క్ స్కూలు పేరుతో ఐదేళ్లుగా నిర్వహిస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.