రాష్ట్రీయం

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో 4.5 కిమీ నుంచి 5.8 కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది మరో నాలుగు రోజుల్లో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆవర్తన ప్రభావంతో కోస్తాలో ఒకటి, రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆవర్తనం మరింత బలపడితే రుతుపవనాల కదలిక ఆశాజనకంగా ఉంటుందని తెలిపారు. దక్షిణ కోస్తాలో వడగాల్పులు కొనసాగుతున్నాయి. సాధారణం కంటే అయిదు నుంచి ఆరు డిగ్రీల మేర అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నెల్లూరు, కావలిలో 43 డిగ్రీలు, ఒంగోలు, బాపట్ల, తునిలో 42 డిగ్రీలు, గన్నవరం, కాకినాడ, నర్సాపురం పట్టణాల్లో 41 డిగ్రీల మేర ఆదివారం ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.