రాష్ట్రీయం

రైతన్నదే ‘పవర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 16: రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. అన్నదాతలకు ఉచితంగా 9 గంటలపాటు విద్యుత్ సరఫరా అందించాలని, అది కూడా పగటిపూటే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను తక్షణమే రూపొందించాలని ఇంధన, అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీకాంత్‌లను సీఎం ఆదేశించారు. రైతులకు ఉచితంగా 9 గంటల పాటు కరెంట్ సరఫరా, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అవసరమైన వాటా కేటాయించే విషయంలో రాజీపడే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్‌తో పాటు బోర్లు, ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే అందించాలని నిర్ణయించడం, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.12,500 అందజేయనుండటం వంటి ప్రోత్సాహకాలతో రైతులను కష్టాల నుంచి గట్టెంక్కించేందుకు తీసుకున్న నిర్ణయాలే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా సీఎం చెప్పారు. రైతుల కంటే నాకేదీ ప్రధానంకాదు.. వారే నా ఆత్మ బంధువులన్నారు. పాదయాత్ర సమయంలో అన్నదాతల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూశానని, గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్ల రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, ఆ దుర్భర పరిస్థితిని మేం మార్చబోతున్నామని భరోసా ఇచ్చారు. రైతును ఆర్థికంగా బలోపేతం చేస్తామని ప్రకటించారు. మాది రైతుల అనుకూల ప్రభుత్వం..
నేను రైతులతోనే ఉంటా.. మున్ముందు అన్నీ మంచిరోజులే అని భరోసా ఇచ్చారు. తానిచ్చే ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడటమే తన లక్ష్యమన్నారు.
తమ ప్రభుత్వం దివంగత నేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తుందని మంత్రి బాలినేని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదివారం అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయటమేకాక తొలిసారిగా రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని వైఎస్సార్ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. నాడు వైఎస్ అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అనేక రాష్ట్రాలు అనుసరించాయని దురదృష్టవశాత్తు ఇంతటి అద్భుతమైన పథకాన్ని తరువాత ప్రభుత్వాలు నీరుగార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ ఉచిత విద్యుత్ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల పంటలు దెబ్బతినే పరిస్థితి తలెత్తకుండా చూడాలనేదే సీఎం సంకల్పమన్నారు. 9గంటల ఉచిత విద్యుత్‌పై క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం నేరుగా రైతులతో మాట్లాడతారని మంత్రి బాలినేని వివరించారు. రైతులకు ఉచితంగా 9 గంటల పాటు కరెంట్ సరఫరా, ఎస్సీ, ఎస్టీ కాలనీ వాసులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 6663 వ్యవసాయ, 11 కేవీ ఫీడర్లు ఉన్నాయని, వీటిలో కేవలం 1712 (26 శాతం) ఫీడర్లకు మాత్రం అదనంగా వౌలిక సదుపాయాలు కల్పిస్తే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభించ వచ్చని అధికారులు మంత్రికి వివరించారు. కొత్తగా 16 అదనపు హై టెన్షన్ (ఈహెచ్‌టీ) సబ్‌స్టేషన్లు, 32 కెపాసిటర్ బ్యాంక్‌లు, 52 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 112 కిలోమీటర్లు అదనంగా హై ఓల్టేజి లైన్లు వేయాలని వాటికి దాదాపు రూ 17 వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఈ 26 శాతం వ్యవసాయ ఫీడర్లు పగలు 5 గంటలు, రాత్రిళ్లు మరో 4 గంటల వరకు విద్యుత్ సరఫరా అందిస్తున్నాయని వివరించారు. అయితే వౌలిక సదుపాయాలతో అందుబాటులో ఉన్న 4951 (74 శాతం) గ్రామీణ ఫీడర్ల ద్వారా వీలైనంత త్వరగా రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభించాలని, 1712 ఫీడర్లకు అవసరమైన వౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి బాలినేని చెప్పారు. రైతుల కోసం అదనంగా ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందరికీ విద్యుత్ పథకం కింద వౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రపంచ బ్యాంక్ నుంచి అందాల్సిన రూ 3700 కోట్లు రుణంపై కేంద్రంతో చర్చించాల్సి ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18.15 లక్షల పంపుసెట్లు ఉన్నాయని రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. వ్యవసాయ రంగానికి రెండు రకాలుగా (ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు) విద్యుత్ సరఫరా చేసే అంశాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆధ్యయనం చేస్తున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి లక్ష్యాలకు అనుగుణంగా రైతులకు ఉచితంగా 9 గంటల పాటు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. 5213 మెగావాట్ల వ్యవస్థాపిత సామర్ధ్యాన్ని పొందిన ఏపీ జెన్‌కో, డిమాండ్‌లో అసాధారణంగా పెరుగుదల దృష్ట్యా ఏపీ జెన్‌కో ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఆప్టిమైజ్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ బి. శ్రీ్ధర్ తెలిపారు.