రాష్ట్రీయం

కూల్చడం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు దీటుగా బలమైన శక్తిగా బీజేపీ అవతరిస్తుందని, అధికార పార్టీ దుర్నీతికి చెక్ పెడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు. వాస్తు దోషాలు ఉంటే సరిదిద్దాలని, అంతేకానీ సచివాలయం కూల్చి కొత్త కట్టడాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పదే పదే బంగారు తెలంగాణ అంటున్నారని, కాని బాధల తెలంగాణగా మారుతోందన్నారు. బంగారు తెలంగాణ కావాలనుకుంటే కేసీఆర్ తప్పనిసరిగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై ఉండేవారన్నారు. నిధులు, సంక్షేమం గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్‌కు మోదీ గుర్తుకు వస్తారన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు బీజేపీ ప్రభుత్వమే ఇచ్చిందని ఆయన అన్నారు. మహారాష్టక్రు వెళ్లి ఆ రాష్ట్ర సీఎంను ఆహ్వానించిన కేసీఆర్ ఢిల్లీకివెళ్లి మోదీని ఎందుకు ఆహ్వానించలేదన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నాలుగు సీట్లు కోల్పోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏమైందని ఆయన నిలదీశారు. ఎన్నికల కంటే ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ విస్తృత ప్రచారం చేశారన్నారు. కేసీఆర్ సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. జూన్, జూలై మాసంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయబోతున్నట్లు ఆయన చెప పరు. కార్పోరేట్ స్కూళ్లలో ఫీజులను కట్టడి చేయడం లేదన్నారు. ఉపకారవేతనాలు లేక విద్యార్థులు నానాబాధలు పడుతున్నారన్నారు. ఈ నెల 24వ తేదీన పాఠశాల విద్య కమిషనరేట్ ఎదుట ధర్నా చేస్తామన్నారు. వచ్చే నెలలో కొత్త కమిటీలు వేసి పార్టీ సభ్యత్వాలు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. చాలా మంది ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్