రాష్ట్రీయం

కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వంపై పెదవి విరుస్తూ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలవరం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి జంప్ కావడంతో పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా కోల్పోయినట్లే. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు సీఎల్‌పీ నేత భట్టివిక్రమార్క, సీతక్క, డీ శ్రీ్ధర్‌బాబు, జగ్గారెడ్డి, రాజ్‌గోపాల్ రెడ్డి, వీరయ్య ఉన్నారు. ఇటీవలనే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా ఎన్నిక కావడంతో హుజుర్‌నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇందులో వీరయ్య కూడా ఎంత వరకు కాంగ్రెస్‌లో ఉంటారనేదానిపై అనుమానాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం బలమైన నేతగా ఉన్న రాజ్‌గోపాల్ రెడ్డి కూడా పార్టీ పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలు, కార్యకర్తలను పునరాలోచనలో పడేశాయి. రాజ్‌గోపాల్ రెడ్డి బీజేపీ బలమైన ప్రత్యామ్నాయమని వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇప్పటికే కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్వాగతించారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా తమకే ఉందని బీజేపీ నేతలు చెప్పడం గమనార్హం. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీలో జోష్ నెలకొంది. రాజ్‌గోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసును కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఇచ్చే అవకాశం ఉంది. అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరించవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో పాత నల్లగొండ జిల్లాలోనే కాంగ్రెస్ బలంగా ఉంది. నల్లగొండ, భువనగిరి ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కూడా ఇదే జిల్లాకు చెందిన ఎంపీ. కాగా, రాజ్‌గోపాల్ రెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో టచ్‌లో ఉన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే కాంగ్రెస్‌లో చివరకు ఎంత వరకు ఎమ్మెల్యేలు మిగులుతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే సీనియర్ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, డీకే అరుణ బీజేపీలో చేరారు. టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి జితేందర్ రెడ్డి బీజేపీలో చేరారు. కాగా తాను చేసిన ప్రకటనపై రాజ్‌గోపాల్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత జీ నిరంజన్ కోరారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదనే కోమటిరెడ్డి ఈ పరిస్థితికి తామెంత బాధ్యులమో ఆలోచించాలన్నారు. ఈ మధ్య సొంత ప్రయోజనాలకు ఇతర పార్టీల్లో చేరే వారికి, చేరాలనుకునే వారికి కాంగ్రెస్ పార్టీ నీచంగా మాట్లాడడం ఫ్యాషెన్‌గా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎదిగిన ఈ నేతలు కన్న తల్లి ఎదపై తనే్న ద్రోహులుగా మారడం సిగ్గుచేటన్నారు. సొంత ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలకు ఎప్పుడైనా ప్రాధాన్యత ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి కాంగ్రెస్‌లో ఉన్నంత స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలో ఉండదన్నారు. ఇతర పార్టీలో చేరితే కానీ రాజ్‌గోపాల్ రెడ్డి లాంటి వారి నోటి దురదకు అడ్డుకట్టపడదన్నారు.