రాష్ట్రీయం

తెలంగాణలో కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంటుందని, ఈ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అన్నారు. రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్‌కు పునాదులు ఉన్నాయన్నారు. బీజేపీ బలపడే
అవకాశాలు లేవన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి చేసిన ప్రకటన బాధాకరమన్నారు. ఈ ప్రకటనలు పార్టీ కేడర్‌ను అయోమయానికి గురి చేస్తాయన్నారు. కాంగ్రెస్‌లో అన్ని రకాల పదవులు అనుభవించి ఇప్పుడు ఈ రకంగా మాట్లాడడం పద్ధతి కాదన్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 30 శాతం ఓట్లు వచ్చాయన్నారు. దిగువ స్థాయి కార్యకర్తలు ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ అన్నారు. పార్టీని ప్రజల నుంచి ఎవరూ దూరం చేయలేరన్నారు. పార్టీలో ఉండి బలోపేతం చేయాల్సిన నేతలు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలపడి అధికారంలోకి వస్తుందన్నారు.
వీహెచ్ జన్మదిన వేడుకలు
మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు జన్మదిన వేడుకలు ఇక్కడ పార్టీ కార్యకర్తలు నిర్వహించారు. హాజీపూర్ ఘటనలో బలైన ముగ్గురు అమ్మాయిల కుటుంబాలకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. అంబర్ పేటలో ఆయన నివాస గృహానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీనియర్ నేత మల్లు రవి తదితరులు వీ హనుమంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.