తెలంగాణ

మరణంలోనూ వీడని దాంపత్య బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, ఏప్రిల్ 12: వడదెబ్బతో భర్త మృతి చెందడంతో అతని అంత్యక్రియలు నిర్వహిస్తుండగా భార్య గుండె ఆగి మృతి చెందింది. ఈ మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండల పరిధిలోని గోప్లాపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగయ్య (68) అనే వృద్ధుడు సోమవారం వంటచెరకు కోసం ఆడవికి వెళ్లి తిరిగి వస్తుండగా వడదెబ్బకు గురికావడంతో వెంటనే వనపర్తి ఆసుపత్రికి తరలించారు. అయతే, అతని పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు నిర్వహిస్తుండగానే భర్త మృతిని తట్టుకోలేక భార్య సౌభాగ్యమ్మ (62) గుండె ఆగి మృతి చెందింది. మరణంలో కూడా దాంపత్యబంధం వీడిపోలేదని గ్రామస్థులు కంటతడి పెట్టారు. వృద్ధ దంపతులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులను సర్పంచ్ లక్ష్మి, ఎంపిటిసి వెంకటమ్మ, నాయకులు పుల్లారావు, రాజేందర్‌గౌడ్‌లు పరామర్శించారు.

నల్లగొండ...నిప్పుల కుండ

44 డిగ్రీల ఉష్ణోగ్రత..తెలంగాణలోనే టాప్!!
భయపెడుతున్న వడగాలులు..పెరుగుతున్న వడదెబ్బ మరణాలు

ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఏప్రిల్ 12: తెలంగాణలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో సోమ, మంగళవారాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో సూర్యప్రతాపానికి ప్రజలు, పశుపక్ష్యాదులు అల్లాడిపోతుండగా రోజంతా వీస్తున్న వడగాలులుతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ 12 నాటికి ఇప్పటికే జిల్లాలో దాదాపుగా 150మందికి పైగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు, ఉపాధి కూలీలు, గొర్రెల కాపరులు, రైతులు వడదెబ్బలకు మృతి చెందారు. పశువులు, గొర్రెలు, మేకలు, వణ్యప్రాణులకు తాగునీరు సైతం దొరకక అలమటిస్తూ మృత్యువాత పడుతున్నాయి. పెద్ద ఎత్తున కరవు ఏర్పడిన నేపథ్యంలో జిల్లా రైతాంగం పశగ్రాసానికి ఇబ్బంది పడుతూ పశువులను కబేళాలకు తరలిస్తుండడం ఆందోళనకరంగా మారింది. జిల్లాలో తీవ్ర వర్షాభావం, కరవుతో పాటు మండుతున్న ఎండల ధాటికి చెరువులు, కుంటలు అడుగంటిపోగా బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి పంటలు, పండ్ల తోటలు ఎండిపోయాయి. ఎండల్లో ఉపాధి పనులు సైతం సాగక కూలీలు జీవనోపాధికి వెతలు పడుతున్నారు. మరోవైపు రబీ వరికోతల సీజన్ నడుస్తుండడంతో రైతులు ఎండల్లోనే పంట కోతల పనులు, ధాన్యం అమ్మకాల పనుల్లో నిమగ్నమవడంతో వారు అధికంగా వడదెబ్బలతో అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికే 1700 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనగా రోజురోజుకూ ఈ సంఖ్య మరింత పెరిగిపోతోంది. ఎండల తీవ్రత జిల్లాలో ఇదే రీతిలో ఉంటే జిల్లాలో తాగునీటి ఎద్దడి మరింత తీవ్రమవడంతో వడదెబ్బ మరణాలు మరింతగా పెరిగే అవకాశముందన్న ఆందోళన ప్రజలను కలవరపెడుతోంది.

ఎస్సైపై రాళ్లతో మహిళల దాడి

ఖపరిస్థితి ఉద్రిక్తం - పోలీసుల రంగప్రవేశం
ఖఆందోళనకారులను శాంతపరిచిన సిఐ సురేందర్
కోరుట్ల, ఏప్రిల్ 12: కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణంలో పలువురు మహిళలు రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘ టనలో ఎస్‌ఐకి తల, ముఖానికి గాయాలయ్యాయ. వివరా ల్లోకి వెళ్తే... పట్టణంలోని పట్టణంలోని 9వ వార్డులో అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపి వేయాలని ఆ వార్డు ప్రజలు ఆందోళన చేస్తుండగా ఆందోళన విరమించకపోతే చట్టపరంగా చర్య తీసుకుంటామని పోలీస్ మార్క్ చూపించాల్సి ఉంటుందని ఎస్సై బాబురావు హెచ్చరించారు. దీంతో రెచ్చిపోయిన మహిళలు రాళ్లతో దాడి చేయడంతో ఎస్సైకి గాయాలు కావడంతో పోలీసులకు-మహిళలకు తీవ్ర వాగ్వాదం చెలరేగింది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో సమాచారం అందుకున్న ఇన్‌చార్జి సిఐ వాసం సురేందర్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న కాలనీ వాసులను సముదాయించి సెల్ టవర్ నిర్మాణాన్ని పనులు నిలిపి వేసేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. కాగా, కాలనీ వాసుల రాళ్ల దాడిలో గాయపడిని ఎస్సైని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.