రాష్ట్రీయం

కొనసాగుతున్న దీక్ష స్వీకార మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 16: విశాఖ శారదాపీఠం వారసుని నియామక ప్రక్రియ గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో రెండవ రోజు అత్యంత వైభవంగా కొనసాగింది. పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో ఈ దీక్షాస్వీకార మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. తురి ఆశ్రమ దీక్షాస్వీకారం చేపడుతున్న కిరణ్‌కుమార్ శర్మ మహాగణపతికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాస్వామి స్వరూపానందేంద్ర ప్రసంగిస్తూ కిరణ్‌కుమార్ శర్మ ధర్మశాస్త్రాలను అవుపోసన పట్టారని, ఇలాంటి వారసుడు పీఠానికి లభించడం ఆనంద దాయకమన్నారు. ఈ క్రతువులో భాగంగా స్వామివారు చంద్రవౌళేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రి మోపిదేవి వెంకటరమణ కార్యక్రమానికి విచ్చేయగా స్వామివారు మంగళాశాసనాలు అందించారు. ఈ క్రతువు 17వ తేదీతో ముగుస్తుందని స్వామి తెలిపారు. ముగింపు కార్యక్రమంలో సీఎం జగన్మోహనరెడ్డితో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పాల్గొంటారని కార్యక్రమ నిర్వాహకులు, సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భరత్‌రెడ్డి తెలిపారు.
చిత్రం... స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న శారదా పీఠం వారసుడు కిరణ్‌కుమార్ శర్మ