రాష్ట్రీయం

తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2017 సంవత్సరానికి గాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. పద్య కవితా ప్రక్రియలో ఈసారి మాల్యశ్రీ (చింతూరి మల్లయ్య) రచించిన ‘మన్యభారతం’, వచన కవితా ప్రక్రియలో నారాయణ స్వామి రచించిన వానోస్తద...? గేయప్రక్రియలో తుమ్మూరి రామమోహనరావు రాసిన ఎలకోయిల పాట సాహితీపురస్కారాలకు ఎంపికయ్యాయి. బాలసాహిత్యంలో కొల్లూరు స్వరాజ్యం వెంకట రమణమ్మ రాసిన అనగా అనగా పిల్లల కథలు పుస్తకానికి, బీ మురళీధర్ రాసిన నెమలినారకు, భూతం ముత్యాలు రాసిన మొగలి నవలకు పురస్కారాలు దక్కాయి. అట్లా వెంకటరామిరెడ్డి రాసిన శైలీ శిల్పం వెయ్యేళ్ల తెలుగు కవిత్వం పుస్తకానికి, భారతుల రామకృష్ణ రాసిన సప్త సౌరభాలు నాటికకు, మెహక్ రాసిన గుప్పిట జారే ఇసుక అనువాద గ్రంథానికి, వచన రచనల్లో కోవెల సంతోష్‌కుమార్ రాసిన దేవరహస్యం పుస్తకానికి, జూపాక సుభద్ర రాసిన రాయక్క మాన్యం గ్రంథానికి సాహితీ పురస్కారాలను ఇస్తున్నట్టు వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. పురస్కారం కింద 20,116 రూపాయిల నగదు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
డిగ్రీలో 70,153 మంది చేరిక: కన్వీనర్ ప్రొ.లింబాద్రి
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 1,05,346 మందికి సీట్లు కేటాయించగా, వారిలో 70,153 మంది తమకు కేటాయించిన సీట్లను కన్ఫర్మ్ చేసుకున్నట్టు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చెప్పారు. రెండో దశ కౌనె్సలింగ్‌కు ఇంత వరకూ 31,700 మంది రిజిస్టర్ చేసుకున్నారని అందులో 31,444 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారని, మొదటి దశలోనూ, రెండో దశలోనూ ఉన్న వారంతా కలిపి మొత్తం 66,299 మంది తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేశారని అన్నారు. వారందరికీ ఈ నెల 20వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని, మూడో దశ కౌనె్సలింగ్ 20వ తేదీ తర్వాత మొదలవుతుందని చెప్పారు.