రాష్ట్రీయం

కోర్టులకు పోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: సుదీర్ఘకాలం నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అనంత సమస్యలకు ముగింపుపలికే సమయం ఆసన్నమైంది. విద్యా రంగం, విద్యుత్, నీటి పారుదల, పలు రాష్ట్ర సంస్థల విభజనతో పాటు నిధుల పంపిణీ, భౌగోళిక విభజన సమస్యలు, ప్రధానంగా ఉద్యోగుల పంపిణీ, అంతర్‌రాష్ట్ర బదిలీల వంటి కీలక అంశాలను న్యాయస్థానాలకు వెళ్లకాకుండా.. ముఖాముఖి మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారాలను అనే్వషించాలని ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. రాష్ట్రాల పునర్విభజన అనంతరం ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాంతంగా సమావేశం కావడం ఇదే ప్రథమం. ఈసారి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు వీరికి సాయపడుతూ సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలను ఇరువురికి వివరించడంతో వ్యవహారం మరింత తేలికైంది. నెల రోజుల్లో రెండు మార్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆంధ్రా పర్యటన, అదే రీతిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సైతం ఇప్పటికే రెండు మార్లు హైదరాబాద్‌లో కేసీఆర్‌తో కలిసి జరిపిన చర్చలు ముందడుగు వేశాయి. ఈసారి జగన్మోహన్‌రెడ్డితో కలిసి తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఇరువురూ రెండుగంటలకు పైగా విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని అంశాలపై దృష్టిసారించారు. విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపైనా సానుకూల వాతావరణంలో ఇరువురు సీఎంల చర్చలు సమస్యల పరిష్కారానికి ఊతం ఇచ్చాయని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ వచ్చినపుడు మరోమారు చర్చలు జరిగే అవకాశం ఉన్నా, సమగ్రంగా ఈ నెల 24వ తేదీన అధికారులు, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ముఖ్యకార్యదర్శుల స్థాయిలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొన్ని సమస్యలపై తక్షణ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో గవర్నర్ సమక్షంలో భేటీ అయినపుడు కొన్ని సమస్యలపై ప్రస్తావనకు వచ్చినా, అవి చర్చల దశలోనే ఆగిపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, హైదరాబాద్‌లోని కొన్ని కీలక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరీ ప్రధానంగా జలవనరుల పంపిణీ, విద్యుత్ పంపిణీ అంశాలు ఎటూ తేలకుండా చాలా కాలం నుంచి పీటముడివేసుకున్నాయి. విద్యారంగానికి సంబంధించి యూనివర్శిటీల విభజన, తెలుగు అకాడమి, ఉన్నత విద్యా మండలి విభజన, తెలుగు యూనివర్శిటీ, అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ, ఆర్కివ్స్, ఆర్కియాలజీ లైబ్రరీ వంటి సంస్థల విభజన కూడా పూర్తికాలేదు, ఆయా సంస్థల ఆధీనంలో ఉన్న నిధులకు సంబంధించి సుప్రీంకోర్టు వరకూ వివాదాలు వివిధ దశల్లో ఉన్నాయి. కార్మిక శాఖ బిల్డింగ్ ల్యాబర్ సంక్షేమ నిధి, సహా పలు సంక్షేమ నిధిల విభజన కూడా జరగలేదు. కొన్ని సంస్థల విభజన జరగకపోయినా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ సంస్థలను ఏర్పాటు చేసుకుని ప్రస్తుతానికి పనికానిస్తున్నా అంతర్గతంగా అనేక వివాదాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఆ సమస్యల పరిష్కారం లభించక అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య కూడా ఘర్షణ వాతావరణం తెలెత్తిన సందర్భాలున్నాయి. మరో పక్క ఉద్యోగుల అంతర్ రాష్ట్ర బదిలీలు కాకపోవడం, భార్య ఒక చోట, భర్త ఒక చోట పనిచేయడంతో తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. బదిలీలకు సంబంధించిన వేలాది ఫైళ్లు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య స్పష్టత లేకపోవడంతో బదిలీల అంశాన్ని సీనియర్ అధికారులు సైతం ఎటూ తేల్చలేకపోయారు. కొన్ని దరఖాస్తులు సచివాలయం స్థాయిలో ఆగిపోయాయి. వాటన్నింటికీ మోక్షం కలగవచ్చని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు.

చిత్రాలు..కేసీఆర్‌కు కనకదుర్గమ్మ ప్రతిమను బహూకరిస్తున్న ఏపీ సీఎం జగన్
*ఉండవల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసంలో సోమవారం విందు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,
ఇతర నేతలు