రాష్ట్రీయం

ఆరోపణలు.. ప్రత్యారోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆరోపణలు..ప్రత్యారోపణలు..వ్యక్తిగత దూషణలతో సభాపర్వం సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర దూషణలు.. అవినీతి, అక్రమాలపై పరస్పర నిందారోపణల మధ్య 15వ శాశనసభ సమావేశాలు కొనసాగాయి. శాసనసభ సమావేశాలు ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభమై 18తో ముగిసాయి. అధికార వైసీపీ సభ్యులు చాలామంది యువ ఎమ్మెల్యేలు కావటంతో పాటు గత అనుభవాల నేపథ్యంలో ప్రతిపక్షనేత చంద్రబాబుతో పాటు టీడీపీ సభ్యులతో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలకు దిగారు. ప్రభుత్వం అమలు చేయనున్న నవరత్నాల మాట అటుంచి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైనే సుదీర్ఘంగా చర్చించారు. కొత్తగా అధికారపగ్గాలు చేపట్టిన నేపథ్యంలో భవిష్యత్‌లో అనుసరించే విధివిధానాలపై అధికార పార్టీ నేతల్లో స్పష్టత లోపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగంలో మినహా చాలామంది సభ్యులు గత పదిహేను రోజుల కాలంలో చేపట్టిన సంస్కరణల గురించి ప్రస్తావించకపోవటం గమనార్హం. రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి మినహా ప్రతిపక్ష సభ్యులు సైతం తమ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకునే ప్రయత్నాలు చేశారు. వారం రోజుల సమావేశాల్లో రెండు రోజులు సెలవు కావటంతో ఐదు రోజులు సభను నిర్వహించారు. మొత్తం 19 గంటల 25 నిమిషాల సేపు వివిధ అంశాలపై చర్చించారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక నేపథ్యంలో రెండురోజులు మాత్రమే చర్చకు అవకాశం లభించింది. ప్రత్యేక హోదాపై ఒకే ఒక్క తీర్మానాన్ని ఈ సమావేశాల్లో ఆమోదించారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.