రాష్ట్రీయం

నమ్మకాన్ని వమ్ము చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన నలుగురు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ తన చాంబర్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నప్పరెడ్డి, నవీన్‌రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, వి శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఎమ్మెల్సీలు నలుగురు శాసనసభకు ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు ఆర్పించారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఎమ్మెల్సీలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తమను ఎమ్మెల్సీలుగా ఖరారు చేయడం పట్ల వారు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధినేత తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తామన్నారు. పార్టీని బలపేతం చేయడంతో పాటు సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్న బంగారు తెలంగాణను సాకారం చేయడానికి భాగస్వామ్యం అవుతామన్నారు. ఇలా ఉండగా నలుగురు ఎమ్మెల్సీలు సాయంత్రం ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

చిత్రం...సీఎం కేసీఆర్‌కు ప్రమాణ స్వీకారం అనంతరం పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్సీలు