రాష్ట్రీయం

ప్రాజెక్టుల పేరిట కాంగ్రెస్ నేతల ధనయజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల పేరిట నిధులు మెక్కారని, అయితే తామేమో ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే ఓర్వలేక పసలేని విమర్శలు చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో మొదలు పెట్టిన ఒక్కటైనా ప్రాజెక్టును పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. మొబిలైజైషన్ అడ్వాన్స్‌ల పేరిట ప్రాజెక్టుల పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టారని ధ్వజమెత్తారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు రాకపోవడానికి కాంగ్రెస్ నాయకులు కారణం కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే వారికి కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టవద్దు, సెక్రటేరియట్ నిర్మించవద్దని అనడానికి వారికి సిగ్గు ఉండాలని ఎర్రబెల్లి దుయ్యబట్టారు. పసలేని విమర్శిలు, ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నాయకులను గ్రామాలన నుంచి తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ విమర్శించారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో వీరు మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము అనుమతులు ఇవ్వడం వల్లనే పూర్తి అయిందని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అంతర్భాగం కాదా? అనుమతులు ఇచ్చి తీరాల్సిందేనని, ఇందులో బీజేపీ సర్కార్ చేసిన మెహర్బానీ ఏమి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వాలేదని సీఎం కేసీఆర్ చెబితే బీజేపీ నాయకులకు ఉలికిపాటు ఎందుకని సుమన్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డి అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయకట్టు పెరిగిన విషయాన్ని దాచిపెట్టి, కేవలం ప్రాజెక్టు వ్యయం పెరిగిదంటూ జీవన్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సుమన్ ధ్వజమెత్తారు.

చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు