రాష్ట్రీయం

హమ్మయ్య.. మోత తగ్గింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: పుస్తకాల భారంతో తలమునకలవుతున్న విద్యార్థులకు శుభవార్త. ఎన్‌సిఇఆర్‌టి సహా స్టేట్ సిలబస్ పుస్తకాలు యాప్ రూపంలో, నెట్‌లోనూ ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు. స్కూళ్లకు పుస్తకాలు మోసుకెళ్లాల్సిన భారంలేకుండా కేవలం ట్యాబ్ లేదా మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. దీనివల్ల పుస్తకాల భారం సమూలంగా తగ్గిపోతుంది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు మీడియంలలో ఈ-పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. మరో అదనపు ఆకర్షణ ఏమంటే చాప్టర్ల వారీ టాపిక్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అదే స్టేట్ సిలబస్‌లో అయితే పాఠాలవారీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 1నుండి ప్లస్ టు స్థాయి వరకూ విద్యార్ధులకు అన్ని పాఠ్యపుస్తకాలను ఈ-పాఠశాల డాట్ ఎన్‌ఐసి డాట్ ఇన్ పేరిట మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా సహ పాఠ్యప్రణాళికకు సంబంధించి కూడా మాన్యువల్స్‌ను వర్కుబుక్‌లను రూపొందించింది. టీచర్లకు, విద్యార్ధులకు, విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా ఈ యాప్ ద్వారా తాజా సమాచారం సమగ్రంగా లభిస్తుంది. సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లలో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలను ఉచితంగా చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీఇఆర్‌టి తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లోనూ, ఆంధ్ర ప్రభుత్వం ఎపిఎస్సీఇఆర్‌టి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో స్టేట్ సిలబస్ పాఠ్యపుస్తకాలను ఉంచుతోంది. ఈ ఏడాది తెలంగాణలో, ఆంధ్రలో కొన్ని పుస్తకాలు మారుతున్నాయి. ఇప్పటికే పాత సిలబస్‌తో ఉన్న పుస్తకాలను నెట్‌లో ఉంచారు. కొత్త పుస్తకాలు రాగానే వాటిని సైతం వారం పది రోజుల్లో అప్‌డేట్ చేయనున్నారు. రాష్ట్ర సిలబస్ పుస్తకాలతోపాటు బిఇడి విద్యార్థులకు, డి.ఇడి విద్యార్థులకు సిలబస్, ఈ-పుస్తకాలు, కో కరిక్యులమ్ పుస్తకాలు, వాటి సిలబస్‌ను కూడా నెట్‌లో చేర్చింది. ఈ-టెక్ట్స్ బుక్స్, సప్లిమెంటరీ బుక్స్, ఈ-రీసోర్సెస్ పేరిట వీటిని అందుబాటులోకి తెచ్చారు. పుస్తకాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయమని విద్యార్థులపైనా, తల్లిదండ్రుల పైనా వత్తిడి చేయడం అనారోగ్యకరమైన అలవాటని, రానున్న రోజుల్లో ఈ అలవాటును పాఠశాలలు తగ్గించుకోవాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.