రాష్ట్రీయం

రుతు పవనాలు వస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: నైరుతీ రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను రెండు, మూడు రోజుల్లో పలకరిస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఐఎండీ తన వెబ్‌సైట్‌లో బుధవారం పొందుపరచిన వివరాల ప్రకారం వచ్చే రెండు, మూడు రోజుల్లో నైరుతీ రుతుపవనాలు తెలంగాణతో పాటు, దక్షిణ కొంకన్, గోవా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విస్తరించేందుకు సానుకూలంగా వాతావరణం ఉందని వివరించారు. రుతుపవనాలు ముందుకు కదిలేందుకు బలమైన గాలులు వీస్తున్నాయని, అరేబియా సముద్రంలో వాతావరణం కూడా అనుకూలంగా ఉందని వివరించారు. ఇలా ఉండగా గత 45 రోజుల నుండి వేడిగాడ్పులతో అల్లలాడిన తెలంగాణలో ఇప్పుడు వడగాడ్పుల తీవ్రత తగ్గింది. ఇటీవలి వరకు 45-46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న పగటి అత్యధిక ఉష్ణోగ్రత 40-41 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది మరింత తగ్గుతుందని ఐఎండి వర్గాలు వెల్లడించాయి.