రాష్ట్రీయం

ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి బుధవారం నాడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వీ వెంకటరమణ, కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని , పూర్వ కన్వీనర్‌లు పాల్గొన్నారు. పరీక్షకు 52,380 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 43,113 మంది హాజరయ్యారు. అందులో 41,195 మంది క్వాలిఫై అయ్యారని మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. మాథ్స్‌లో 10,456, పీఎస్‌లో 3392 మంది, బయాలజీలో 11215 మంది, సోషల్‌లో 15256 మంది, ఇంగ్లీషులో 876 మంది అర్హత సాధించారు. ఉస్మానియా వర్శిటీ పరిధిలో 39,951 మంది, ఆంధ్రా, నాగార్జున వర్శిటీ పరిధిలో 235 మంది, ఎస్వీ యూనివర్శిటీ రీజియన్‌లో 235 మంది, ఇతరులు 774 మంది అర్హత సాధించారని అన్నారు. క్వాలిఫై అయిన వారిలో ఎస్సీలు 10,011, ఎస్టీలు 5057, బీసీలు 21,919 మంది, ఓసీలు 4208 మంది ఉన్నారని చెప్పారు. అర్హత సాధించిన వారిలో ముస్లింలు 619 మంది అబ్బాయిలు, 4439 మంది అమ్మాయిలు, క్రైస్తవులు 54 మంది అబ్బాయిలు, 261 మంది అమ్మాయిలు ఉన్నారని పీహెచ్ అభ్యర్ధులు అబ్బాయిలు 193 మంది, అమ్మాయిలు 185 మంది ఉన్నారని చెప్పారు. లక్ష్మిపేట, భూపాలపల్లి, నారాయణ పేట, కల్వకుర్తిలోని ఐఏఎస్‌ఈల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ఈ ఏడాది నుండి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని పాపిరెడ్డి చెప్పారు.