రాష్ట్రీయం

వచ్చే నెల గ్రూప్-2 ఇంటర్వ్యూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణలో గ్రూప్ -2 రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూలను జూలై నెల మొదటివారంలో నిర్వహించనున్నట్టు సర్వీసు కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి తెలిపారు. బుధవారం నాడు ఆయన టీఎస్‌పీఎస్‌సీ సభ్యులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు కమిషన్ నివేదికను అందించారు. అనంతరం గంటా చక్రపాణి ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ నివేదికను గవర్నర్ అభినందించారని చెప్పారు. కమిషన్ బాగా పనిచేస్తోందని గవర్నర్ ప్రశసించారని చెప్పారు. గ్రూప్ -2 ఇంటర్వ్యూలు జూలై మొదటి వారంలో ఉంటాయని, ఒకటి రెండు రోజుల్లో గ్రూప్ -2 ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. దాదాపు రెండు వేల మందిని ఇంటర్వ్యూలు చేయాలి కనుక కనీసం రెండు మూడు నెలలు పడుతుందని అన్నారు. టీఆర్టీకి ఎంపికైన అభ్యర్ధుల అంశానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపించామని అన్నారు. కోర్టు కేసుల కారణంగా ఆగిపోయిన రిక్రూట్‌మెంట్‌ల ప్రక్రియను త్వరితగతం చేస్తామని ఆయన చెప్పారు.
24 నుండి ఎమ్సెట్ కౌనె్సలింగ్
తెలంగాణలో ఈ నెల 24 నుండి ఎమ్సెట్ తొలి దశ కౌనె్సలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం నాడు విడుదల కానుంది. మొదటి వారం రోజులు రిజిస్ట్రేషన్ కం వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. అనంతరం తొలి దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందిన వారు ఆయా కాలేజీల్లో ఆన్‌లైన్ రిపోర్టు చేసిన తర్వాత మిగిలిన సీట్లకు రెండో దశ కౌనె్సలింగ్ జూలై రెండోవారంలో ప్రారంభం కానుంది. ఎమ్సెట్ కంటే ముందు ఈ నెల 22 నుండి ఈసెట్ ఎఫ్‌డీహెచ్ కౌనె్సలింగ్‌ను నిర్వహిస్తారు.
చిత్రం... టీఎస్‌పీఎస్‌సీ వార్షిక నివేదకను ప్రదర్శిస్తున్న గవర్నర్ నరసింహన్, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ గంటా చక్రపాణి