రాష్ట్రీయం

సార్, మీ ఆధ్వర్యంలోనే ‘కాళేశ్వరం’ జరగాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం మీ అధ్వర్యంలోనే జరగాలని, పెద్ద ధిక్కుగా మీరే వ్యవహరించాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. ఈ నెల 21న జరుగనున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతూ బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన విషయాన్ని గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరించారు. అలాగే ఈ నెల 27న కొత్త సచివాలయ భవనం, శాసనసభ, శాసనమండలి భవనాలకు శంకుస్థాపన చేసే అంశాన్ని కూడా గవర్నర్‌కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోని భవనాలను అప్పగించడం వల్లనే కొత్త సచివాలయ భవనానికి మంచి ముహుర్తంలో శంకుస్థాపన చేసుకునే అవకాశం లభించిందని ఇందుకు చొరవ తీసుకోవడం పట్ల గవర్నర్‌కు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

చిత్రం... కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానిస్తున్న సీఎం కేసీఆర్