ఆంధ్రప్రదేశ్‌

మీ బాధ్యత నాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు/ఏలూరు , ఏప్రిల్ 13: నవ్యాంధ్రప్రదేశ్‌లో విలీనమైన ముంపు మండలాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజనలో భాగం గా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన మండలాల్లో బుధవారం పర్యటించిన అయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు, తూర్పుగోదావరి జిల్లా చింతూరులో బుధవారం సిఎం పర్యటించారు. చింతూరులో నూతన ఐటిడిఎ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయాలను ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టువల్ల నష్టపోయామని బాధ పడవద్దని, విలీన మండలాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ముంపు భూములకు నూతన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తామని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పెంపుదలకు కృషిచేస్తానన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామన్నారు. ప్రతి 750 మంది విద్యార్థులకు ఒక రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుచేస్తామన్నారు. సంక్షేమ పథకాలతో పాటు ఆదాయం పెంచే కార్యక్రమాలు సైతం చేపడతామన్నారు. ఇంటింటికి వంటగ్యాస్, విద్యుత్ ఇస్తామన్నారు. సుమారు రూ.12 కోట్లతో పర్యాటక కేంద్రంగా మారేడుమిల్లిని అభివృద్ధి చేస్తామన్నారు. విలీన మండలాల్లో 680 కిమీ మేర సిమెంటు రహదారులు, 300 కిమీ మేర తారురోడ్లు నిర్మిస్తామన్నారు. చింతూరులో ఏర్పాటు చేసే బస్సు డిపోకు 32 బస్సులను కేటాయిస్తామన్నారు. చింతూరుకు డిగ్రీ కళాశాల మంజూరు చేసినట్టు చెప్పారు. 170 శాశ్వత అంగన్‌వాడీ భవనాలను నిర్మించనున్నట్టు చంద్రబాబు చెప్పారు. అలాగే 53 ఎత్తిపోతల పథకాలను తొమ్మిది కోట్లు వెచ్చించి పునరుద్ధరిస్తామన్నారు. రంపచోడవరంలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేయనున్నట్టు సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే విలీన మండలాలకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. విలీన మండలాల్లో ఉపాధి కూలీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. చింతూరు మండలం నిమ్మలగూడెం గ్రామంలో ఫారంపాండ్ పనులను ఆయన పరిశీలించారు. ఫారంపాండ్‌లో గునపం చేతపట్టి మట్టి తవ్వి బుట్టలో ఎత్తుకుని మోసుకెళ్లి గట్టుపై వేశారు. తదుపరి ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీచేసి, వారితో ముచ్చటించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తెల్లవారుజామునే వచ్చి పనులు చేసుకోవాలని నిమ్మలగూడెం అంగన్‌వాడీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలతో ముచ్చటించి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఇంకుడుగుంతలను పరిశీలించిన సిఎం నాణ్యతాప్రమాణలు తగ్గాయని, మెరుగ్గా నిర్మించాలని కలెక్టర్ అరుణకుమార్‌కు సూచించారు.
పోలవరం నిర్వాసితులకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తామన్నారు. నిర్వాసిత గ్రామాల్లో ఉన్న అన్ని కుటుంబాలను ఉపాధి, ఉద్యోగ, సంక్షేమం తదితర రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. 50ఏళ్ల వరకు కూడా గిరిజనులకు రుణాలు అందించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈప్రాంత కుటుంబాల్లో ఆందోళన రేపుతున్న స్ధానికత అంశంపై రాష్టప్రతికి లేఖ రాశామని, ఈవిషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కుకునూరు మండలం వెంకటాపురంలో ఇటీవల అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయినవారితోపాటు మిగిలిన వారికి కూడా ఐఎవై ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈప్రాంతంలో ఉపాధ్యాయ, రెవిన్యూ, మెడికల్, వ్యవసాయ తదితర విభాగాల్లో ఖాళీల భర్తీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ముంపు బారిన పడని మిగిలిన ప్రాంతంలో సబ్‌స్టేషన్లు, ఫైర్‌స్టేషన్ల ఏర్పాటు చేపట్టామన్నారు. సౌరవిద్యుత్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పిల్లల అభివృద్ధి సక్రమంగా ఉండేందుకు పాఠశాలల్లో బఫే విధానాన్ని ప్రవేశపెట్టామని, దీనివల్ల ఎవరికి ఎంత కావాలంటే అంత భోజనం చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. గిరిజనులకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కలెక్టర్ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... మట్టి తోడుతూ...

చింతూరు మండలం నిమ్మలగూడెంలో పారం పాండ్ గుంతలో తోడిన మట్టిని

మజ్జిగ పంచుతూ..

మోస్తున్న సిఎం చంద్రబాబు , ఉపాధి కూలీలకు మజ్జిగ అందజేస్తున్న ముఖ్యమంత్రి