ఆంధ్రప్రదేశ్‌

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాల మహానాడు నాయకుడు కారెం శివాజీని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌తోపాటు మరో ముగ్గురు సభ్యులు ఈ కమిషన్‌లో ఉంటారు. ఈ సందర్భంగా కారెం శివాజీ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఈ పదవిని ఏ రాజకీయ నాయకునికి ఇవ్వకుండా ఒక దళితునికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకం వమ్ముకాకుండా బాధ్యతలు నిర్వహిస్తానని అన్నారు. గతంలో ఈ కమిషన్‌కు జస్టిస్ పున్నయ్యి చైర్మన్‌గా వ్యవహరించారని, ఆయన స్ఫూర్తితో, ఆయన స్థానంలో వచ్చిన తను బాధ్యతలు నిర్వర్తిస్తానని అన్నారు. త్వరలోనే కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడతానని శివాజీ తెలియచేశారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన మంత్రులు రావెల కిశోర్‌బాబు, యనమల రామకృష్ణుడు, పీతల సుజాత, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు శివాజీ కృతజ్ఞతలు తెలిపారు.
జూనియర్ కళాశాలలకు
29నుంచి సెలవులు
జూన్ 1న పునఃప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ కాలేజీలకు ఈ నెల 29 నుండి సెలవులు ప్రకటిస్తున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. తిరిగి జూన్ 1 నుండి తరగతులు ప్రారంభం అవుతాయని వారు చెప్పారు. జూన్ 1న కాలేజీలు ప్రారంభించిన తర్వాతనే ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో సైతం అడ్మిషన్లు జరగాలని, అప్పుడే కాలేజీలు అడ్మిషన్ల నోటిఫికేషన్లు ఇవ్వాలని బోర్డు అధికారులు తెలిపారు. అంత వరకూ కాలేజీల యాజమాన్యాలు హోర్డింగ్‌లు, పాంప్లెంట్లు, ఇతరత్రా ఎలాంటి ప్రచారం చేయడానికి వీలు లేదని కూడా బోర్డు అధికారులు నిబంధనలు విధించారు. వేసవి సెలవుల తర్వాత తరగతులు, అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నారు.
మూగజీవాలకు తాగునీరు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణలోని అభయారణ్యంలో సంచరించే మూగ జీవాల కోసం రాష్ట్రప్రభుత్వం మంచినీటి సదుపాయం కల్పించేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటోంది. కనీవినీ ఎరుగని కరవువల్ల అడవుల్లోని చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. దీంతో మూగ జీవాలు తాగేందుకు నీరు లభించక అల్లాడుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన అటవీ శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నీటి కుంటలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఏటూరు నాగారం, కవాల్, ఆమ్రాబాద్ అభయారణ్యాల్లో ఎంపిక చేసిన ప్రదేశాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని నీటి కుంటల వద్ద సౌరశక్తితో నడిచే పంపుసెట్లను ఏర్పాటు చేస్తున్నారు.

పుఆమ్రాబాద్ టైగర్ ప్రాజెక్టు వద్ద ఫర్హాబాద్, ఆదిలాబాద్ జిల్లా కవాల్ టైగర్ ప్రాజెక్టు వద్ద సౌరశక్తితో నడిచే బోర్లను ఏర్పాటు చేశారు. మరోరెండు ఈ తరహా బోర్లను ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కనీసం వచ్చే 30 రోజుల పాటు ఈ సదుపాయం కల్పించేందుకు అటవీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి అమలు చేస్తోంది. రాజధానిలోని జూలో కూడా మూగజీవాలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా వేసవి తాపం తగలకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.