రాష్ట్రీయం

మరో 22 మంది ఐపీఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): రాష్ట్రంలో పోలీసు అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 22మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం పోలీసు ఉన్నతాధికారుల స్థానాల్లో మార్పులు, చేర్పులు చేసిన ప్రభుత్వం రెండో దశలో జిల్లాల ఎస్పీలను దాదాపు మార్చేసింది. మరలా కొద్దిమంది ఉన్నత స్థాయి ఐపీఎస్‌లతో పాటు జిల్లా స్థాయి అధికారులు, గత బదిలీల్లో పోస్టింగ్‌లు ఇచ్చిన ఒకరిద్దరిని కూడా ఆయా స్థానాల నుంచి మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ, జీఏడీ, పోలీసు వెల్ఫేర్, తదితర స్థానాలతో పాటు రాష్ట్రంలో ముఖ్యమైన విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌ను మార్చింది. ఇప్పటికే హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థానం నుంచి తప్పించిన ఏఆర్ అనూరాధను రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక శాఖ డీజీగా ప్రభుత్వం నియమించింది. ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా పనిచేసిన ఎన్ బాలసుబ్రహ్మణ్యంను సాధారణ పరిపాలనా విభాగానికి పంపారు. గుంటూరు రేంజ్ ఐజీ రాజీవ్‌కుమార్ మీనాను విశాఖపట్నం పోలీసు కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న మహేష్‌చంద్ర లడ్హాను పోలీసు పర్సనల్ ఐజీగా నియమించారు. ఇక పోలీసు వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అదనపు డీజీగా ఎన్ శ్రీ్ధరరావు నియమితులయ్యారు. పీటీఓ ఐజీగా కె సత్యనారాయణ, ఏపీఎస్పీ ఐజీగా బీ శ్రీనివాసులు, గుంటూరు రేంజ్ ఐజీగా వినీత్ బ్రిజ్‌లాల్‌కు పోస్టింగ్ కల్పించారు. పోలీసు హెడ్ క్వార్టర్స్ డీఐజీగా ఘట్టమనేని శ్రీనివాస్, ఇంటిలిజెన్స్ డీఐజీగా సీహెచ్ శ్రీకాంత్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా జీ పాలరాజు, విశాఖ రేంజ్ డీఐజీగా ఎన్‌కేవీ రంగారావు నియమితులయ్యారు. అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఐజీగా ఎస్ హరికృష్ణ, ఇంటిలిజెన్స్ ఎస్పీగా కేవీ మోహనరావు, సీఐడీ ఎస్పీగా జీవీజీ అశోక్‌కుమార్, అనంతపురం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా సర్వశ్రేష్ట త్రిపాఠి, పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు కోయ ప్రవీణ్, గుంతకల్లు రైల్వే ఎస్పీగా విక్రాంత్ పాటిల్, విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా ఎస్ రంగారావు, విజయవాడ రైల్వే ఎస్పీగా కె నారాయణ నాయక్, కర్నూలు ఏఎస్పీగా ఎం దీపికను నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న జీ ఆంజనేయులును హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.