రాష్ట్రీయం

పేదరికం లేని సమాజం విద్యతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 23: విద్యతోనే పేదరికంలేని సమాజం సాధ్యపడుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అక్షరాస్యతా శాతం, పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పాఠ్య పుస్తకాల పంపిణీ అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పీకర్‌కు జిల్లా కలెక్టర్ జె.నివాస్ వివరించారు. రాష్ట్రంలో అవినీతి, నిర్లక్ష్యవైఖరిని ఉపేక్షించేది లేదంటూ తమ్మినేని అధికారులను హెచ్చరించారు. సృజనాత్మకమైన విద్య ప్రతీ పాఠశాల నుంచి అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, అందుకు అవసరమైన పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అందుకే బడిబాట అన్నారు. ఆదివారం ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ, సర్వశిక్షఅభియాన్ శాఖల అధికారులతో బడిబాటపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అభివృద్ధికి పునాది అన్నారు. ఆర్టికల్-21ఏలో రాజ్యాంగం విద్యాహక్కును ప్రసాదించిందన్నారు. ఇది అంబేద్కర్ అందించిన అద్భుతమైన వరమన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ బాధ్యతాయుతంగా మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ప్రభుత్వ ఉద్యోగులంతా పనిచేయాలని కోరారు. పిల్లలు బడి మానేయడం అనేది ఏమంత చిన్న విషయం కాదన్నారు. ఇది వారి భవిష్యత్‌ను అంధకారం చేస్తోందన్నారు. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడిబయట ఉన్న పిల్లలు బడికి వెళ్ళేలా చేయాలని విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ అధికారులను సూచించారు. కేవలం పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి బడిబాట రూపొందించారన్నారు. జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ప్రతీ పల్లె, పట్టణంలో కనిపించే సమస్యే బడిబయట ఉన్న పిల్లలని, ఆ సమస్యను అప్పట్లోనే రూపుమాపుతానంటూ చెప్పిన మాటే ఇప్పుడు బడిబాట అంటూ స్పీకర్ తమ్మినేని అన్నారు. ప్రతీ ఇంటి నుంచి ఒక ఐఎఎస్, ఐపిఎస్, సైంటిస్టు, డాక్టర్, ఇంజనీర్, ఉన్నత ఉద్యోగులు రావాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. ఆ దిశగా విద్యాశాఖాధికారులు పనిచేయాలన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, వౌలిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు అన్ని వసతులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సర్కార్ బడులు పనిచేయాలన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యవస్థ విద్యావ్యవస్థ అని గుర్తెరిగి అధికారులు సక్రమంగా పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అనుగుణంగా ఉపాధ్యాయులంతా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. మంచి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అర్హత కలిగిన సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాధమిక స్థాయి నుంచే నిరక్షరాస్యతను తగ్గించాలన్నారు. మోడల్ స్కూళ్ళు, కాలేజీలలో సీట్ల పెంపుపై ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. విద్యలో సమూలంగా మార్పులు తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అంటూ చెప్పారు. నిర్లక్ష్యం, అవినీతిని మాత్రం వైసీపీ ప్రభుత్వం సహించదంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో పోటీతత్వం తెస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సీదిరి అప్పలరాజు, గొర్లె కిరణ్‌కుమార్, కలెక్టర్ జనార్దన్ నివాస్, జేసీ-2 రజనీకాంతారావు, డీఆర్వో కె.నరేంద్రప్రసాద్, విద్యాశాఖ, సర్వశిక్షఅభియాన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.