రాష్ట్రీయం

పేరుకే జోన్.. కొత్త కొలువుల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: రాష్ట్ర విభజనలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం రైల్వే జోన్ (సౌత్ కోస్ట్ రైల్వే జోన్)లో కొత్త ఉద్యోగుల భర్తీ ప్రక్రియ లేదని రైల్వే శాఖ తేల్చిచెప్పింది. కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖ రైల్వే జోన్‌లో ఉద్యోగాలు భారీగా ఉంటాయని ఆశించిన నిరుద్యోగులకు నిరాశ కల్గింది. విశాఖ రైల్వే జోన్‌కు అవసరమైన ఉద్యోగుల భర్తీ ప్రక్రియ అంతా దక్షిణ మధ్య రైల్వే జోన్ పర్యవేక్షణలో జరుగుతాయని రైల్వే బోర్డు చెబుతున్న వాదనలో వాస్తవాలు కన్పించడంలేదని రైల్వే ఉద్యోగ, కార్మిక వర్గాలు గుర్తు చేస్తున్నాయి. విశాఖ జోన్‌కు ప్రస్తుతం దేశంలో ఉన్న రైల్వే జోన్లలో పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేస్తారని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రైల్వే నియామక బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఉద్యోగుల భర్తీ అంశాన్ని పరిశీలించడం లేదంటున్నారు. ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం సౌత్‌కోస్ట్ రైల్వే జోన్‌గా విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు చేసింది. అయితే, విశాఖపట్నం జోన్ పరిధి తగ్గించడాన్ని బీజేపీ మినహా అన్ని పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. జోన్‌ను రెండు ముక్కలు చేయడం ఏమిటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఒడిశా రాష్ట్రంలో రాయగఢ్ డివిజన్‌గా కొంత, విశాఖపట్నం డివిజచ్ (వాల్తేర్) కొంతగా విభజించారు. ఎన్నికల సమయంలో హడావిడిగా బీజేపీ ప్రభుత్వం సౌత్‌కోస్ట్‌జోన్‌గా ప్రకటించింది. అయితే, జోన్‌కు నిధులు, ఉద్యోగుల పంపకాలు ప్రకటించకపోవడం పట్ల అందర్నీ విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే జోన్‌లో పరిపాలన సౌలభ్యం లేకపోవడంతో కార్యాలయాల పని వేళలు మరో ఏడాది జాప్యం జరగవచ్చునని రైల్వే అధికారులు చెబుతున్నారు. విశాఖ రైల్వే ఆధీనంలో ఉన్న భూముల్లో కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. వడ్లపూడి వద్ద 123 ఎకరాలు, ముడుసర్‌లోవ వద్ద 52 ఎకారాల భూమి అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. జోన్‌కు అవసరమైన కార్యాలయాల నిర్మాణాలు ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టం చేయడంలేదు. జోన్‌లో ఉద్యోగుల భర్తీ ఎప్పుడు జరుగుతుందో చెప్పడానికి రైల్వే అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో పని చేస్తున్న ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లడానికి ఇష్టపడితే వారు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు గుర్తు చేస్తున్నారు. అధికారుల వౌఖిక ఆదేశాలతో ఉద్యోగుల్లో స్పందన రావడంలేదని రైల్వే ఉద్యోగ, కార్మిక యూనియన్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సౌత్‌కోస్ట్‌రైల్వే జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు చేరాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కేవలం సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు రెవెన్యూ గణనీయంగా వచ్చేది, విభజన తర్వాత రెవెన్యూ తగ్గిపోయందని రైల్వే అధికారులు గుర్తు చేశారు.
చిత్రం...రేణుగుంటలో ఆదివారం రైల్‌కళ్యాణ్ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తున్న ఎస్‌సీ రైల్వే జీఎం గజానన్