రాష్ట్రీయం

బెజవాడలో రాజ్‌భవన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 23: అమరావతిలో రాజ్‌భవన్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో నగరంలోని నీటి పారుదల శాఖ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా మార్చారు. ఈ భవనాలు ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో అందులో రాజ్‌భవన్ కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, ఉండవల్లిలో ప్రజావేదిక నిర్మాణానికి ముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. హైకోర్టు విభజన సందర్భంగా కొద్దిరోజులు ఇవే భవనాలను కేటాయించారు. గవర్నర్ ప్రస్తుతం హోటళ్లలో బస చేయాల్సి వస్తోంది. దీంతో ఇక్కడ వసతి కల్పించేందుకు ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్రానికి గవర్నర్‌ను నియమించే అవకాశాలు ఉన్నందున విజయవాడలోనే గవర్నర్ కార్యాలయం, నివాస భవనాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చిత్రం...రాజ్‌భవన్‌గా మారనున్న నగరంలోని సీఎం క్యాంప్ కార్యాలయం