తెలంగాణ

రాజోలిబండపై త్వరలో కర్ణాటకతో చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజోలి బండ మళ్లింపు పథకం (ఆర్‌డిఎస్)పై కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్‌కి స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటకల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్న ఆర్‌డిఎస్ వివిధ కారణాలతో తెలంగాణ రైతులకు నీరందించలేకపోతున్నదని ఆయన ఆ లేఖలో తెలిపారు. కృష్ణాట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 15.9 టిఎంసిల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు ఆర్డిఎస్ నుంచి సాగునీరు అందవలసి ఉండగా 5 నుంచి 6 టిఎంసిల నీరు కూడా రావడం లేదని తెలిపారు. ఆర్‌డిఎస్ ప్రాజెక్టు కర్నాటకలో 40 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తుందని హరీశ్‌రావు తెలిపారు. కర్నూలు రైతులు తరచూ తూములు పగులగొట్టడం, కర్ణాటక రైతులు అక్రమంగా నీటిని తరలించుకుపోవడం వంటి సమస్యలతో ఆర్‌డిఎస్ ద్వారా తెలంగాణకు రావాల్సిన నీరు రావడం లేదని అన్నారు. ఆర్‌డిఎస్ ఆధునీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నాలకు కర్ణాటక సహకరించడం లేదని హరీష్‌రావు తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంలో భాగంగా బ్యారేజీ ఎత్తు 15 సె.మీ పెంచడానికి, లైనింగ్ మరమ్మతుల కోసం గత ఎపి ప్రభుత్వం 72 కోట్లు మంజూరు చేసి, దానిలో 58 కోట్లను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసిన విషయాన్ని మంత్ర తన లేఖలో వివరించారు. బ్యారేజీ సైట్ కర్ణాటక భూభాగంలో ఉన్నందున ఆ మొత్తాన్ని కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేశారు. కర్నూలు జిల్లా రైతాంగం తరచూ ఆర్డిఎస్ వద్ద ఆందోళనలకు దిగి శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తున్నందున క్షేత్ర స్థాయిలో ఆర్డిఎస్ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని కర్ణాటక మంత్రికి రాసిన లేఖలో సూచించారు. చర్చలకు అనువైన స్థలాన్ని, తేదీని సూచిస్తే తాము కర్ణాటక ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.