రాష్ట్రీయం

అర్చకులకు వయో పరిమితిని నిర్దేశించడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 23: దేవాలయాల్లో మిరాశీకి చెంది పనిచేసే శక్తి సామర్థ్యాలు, ఆరోగ్యం ఉన్న అర్చకులకు వయోపరిమితిని నిర్ధేశించడం రాజ్యాంగ విరుద్ధమని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ రమణదీక్షితులు రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రావడంతో ఏదోఒక రూపంలో ఆలయ విధులకు వస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో శివస్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఆదివారం ఆయన తిరుపతిలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నామన్నారు. దేవాలయ వ్యవస్థకు వందల, వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఇందులో వంశపారంపర్యంగా వస్తున్న అర్చక విధానం ఆలయ వ్యవస్థకు అనుసంధానమైందన్నారు. అర్చకులెవరైనా స్వామివారికి సేవ చేసే శక్తిసామర్థ్యాలున్నంత వరకు వారి విధులు నిర్వహించుకోవచ్చన్నారు. అయితే అందుకు భిన్నంగా అర్చకులు ఈ వయస్సు వరకే పనిచేయాలని నిర్ధేశించడాన్ని తాను వ్యతిరేకిస్తానన్నారు. ఇక స్వామివారి కొలువులో పనిచేసేవారు ఎవరైనా విధులు కొనసాగిస్తున్న సమయంలో ఏమైనా లోపాలుంటే వాటిని ఎత్తిచూపించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు.
అయితే రమణదీక్షితులు విధుల నుంచి తప్పించిన తరువాత ఆలయంలో తప్పిదాలను సమాజం ముందుకు తీసుకురావడం సరికాదన్నది తన వ్యక్తిగత భావన అన్నారు. ఆలయంలో జరిగే పొరపాట్లు విధుల్లో ఉన్నప్పుడు ఆయనకు ఎందుకు కనపడలేదన్నారు. ముఖ్యంగా భగవంతునికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తూ తను పొందే సౌకర్యాలను కుటుంబ పోషణకు వినియోగించుకుంటున్నవే అన్నారు. ఆయన అలాంటప్పుడు అప్పుడే తప్పును ఎత్తిచూపాలన్నారు. వెలుపలికి వచ్చిన తరువాత పొరపాట్లను ఎత్తిచూపడాన్ని తాను వ్యక్తిగతంగా హర్షించనన్నారు.