రాష్ట్రీయం

క్షేత్రస్థాయిలో రైల్వేకు సిబ్బంది కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 23: రైల్వేకు గుండెకాయ వంటిదైన గ్యాంగ్‌మెన్ వ్యవస్థ రోజురోజుకీ బలహీనమవుతోంది. దీనిని పటిష్టపర్చాల్సింది పోయి మరింతగా దిగజారిపోయే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. రైళ్లు నడాలంటే ముఖ్యమైన గ్యాంగ్‌మెన్ వ్యవస్థను అన్నివిధాలా పటిష్టపర్చాల్సి ఉంది. రైల్వేట్రాక్ నిర్మాణం నుంచి వీటి నిర్వహణపనులు వరకు రేయింబవళ్ళు మట్టిలోనే పనిచేసేది రైల్వేలో ఒక్క గ్యాంగ్‌మెన్ మాత్రమే. రైల్వేట్రాక్ నిర్వహణపనుల్లో నిరంతరం నిమగ్నమై ఏ విధమైన సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా చూస్తూంటారు. రైల్వేస్టేషన్ల వద్ద, రైల్వే లైన్లలో, రైల్వేక్రాసింగ్ గేట్ల వద్ద ట్రాక్‌ను పటిష్టపర్చాల్సిని గ్యాంగ్‌మెన్ల కొరత గత కొనే్నళ్ళుగా రైల్వేను వేధిస్తోంది. అయినా ఈ పోస్టుల భర్తీకి రైల్వే ఎటువంటి విధాన నిర్ణయాన్ని తీసుకోకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో రైల్వేలైన్ల నిర్వహణపనులకు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంటోంది. భారతీయరైల్వే పరిధిలో ముఖ్యమైనది ఇంజనీరింగ్ విభాగం దీని పరిధిలోకి వచ్చే గ్యాంగ్‌మెన్లు, కీమెన్ల నియామకాలు జరపకపోవడంపట్ల రైల్వేకార్మిక వర్గాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. భారతీయరైల్వే పరిధిలో 17 రైల్వే జోన్లు, 48 డివిజన్లకు సంబంధించి ఆయా విభాగాల్లో ఐదు లక్షల పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. ఇందులో 20నుంచి 30 శాతం మేర గ్యాంగ్‌మెన్ల కేటగిరీలో భర్తీ చేయాల్సి ఉందని కార్మికవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమైన ఇంజనీరింగ్, మెకానికల్, రన్నింగ్ విభాగాలతోపాటు రైల్వేకు ఆదాయాన్ని తెచ్చిపెట్టె కమర్షియల్, ఆపరేటింగ్, సిగ్నల్ అండ్ టెలికామ్, పరిపాలనా, మెడికల్, సేఫ్టీ, కనస్ట్రక్షన్ తదితర విభాగాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. గత పదేళ్ళుగా ఈ విభాగాల్లో పదవీ విరమణ చేసిన, పదోన్నతులు పొందడం ద్వారా దాదాపు 15 శాతం మేర ఖాళీలు ఏర్పడ్డాయి.
ఇక అనారోగ్యంతో సిక్ పెట్టిన కార్మికుల పోస్టులు సైతం భర్తీ చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో కీలకమైన గ్యాంగ్‌మెన్లు, కీమెన్ల కొరతను రైల్వే ఎదుర్కొనక తప్పడంలేదు. గత కొనే్నళ్ళుగా పలు జోన్ల పరిధిల్లో కొత్త రైల్వేలైన్లు నిర్మిస్తున్నారు. బ్రిడ్జిలు, ప్లాట్‌ఫారాలు, రైల్వేప్రాజెక్టులు వస్తున్నాయి. వీటికి తగినట్టుగా సిబ్బందిని నియమించికపోవడంతో రైళ్ళ నిర్వహణలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నాన్ ఇంటర్ లాకింగ్ పనులు నిర్వహించడం, ప్రతి ఏడాది ఆయా రాష్ట్రాలు ఎదుర్కొనే భారీ తుపాన్ల సందర్భాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టే క్రమంలో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందన్నారు. ఉన్న కొద్దిమందికి పనిభారం తీవ్రమవుతోందని కార్మిక సంఘ ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి డివిజన్ హెడ్‌క్వార్టర్‌లో అధికారుల సేవల కోసం కొంతమందిని, సిక్ అయి కొంతమంది వెళ్ళిపోతుండగా మిగిలింది అతి తక్కువ సిబ్బంది మాత్రమేనని, దీనివలనే రైల్వేలైన్ల నిర్వహణపనులు పూర్తిస్థాయిలో చేయలేని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని ఈ వర్గాలు అంటున్నాయి.
ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే ఖుర్ధా, సంబల్‌పూర్, వాల్తేరు డివిజన్ పరిధిల్లో అన్ని క్యాటగిరీలకు సంబంధించి 35వేల మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తుండగా, ఒక్క వాల్తేరులోనే ఏకంగా 18వేల మందికి మించిపోయి ఉన్నారని, ఇందులో క్షేత్రస్థాయి సిబ్బంది కొరత మాత్రం తీవ్రంగానే ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీనిపై రైల్వేబోర్డు దృష్టిసారిస్తే తప్ప దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తీరవని పేర్కొన్నాయి. ఈ జోన్ పరిధిలో ఇటీవల నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడిన గ్యాంగ్‌మెన్లను అవసరమైన చోట్ల నియమించాల్సి ఉందని, కనీసం మరో 1500 గ్యాంగ్‌మెన్, కీమెన్ల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని రైల్వే వర్గాలు కోరుతున్నాయి.