రాష్ట్రీయం

ముగిసిన జాతీయ కళా సమ్మేళన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 23: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనం శ్రీ వేంకటేశ్వర కళా కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ కళా సమ్మేళన్ ఆదివారం ఘనంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్, ధవళేశ్వరం శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ యూనివర్సల్ సంస్కృతిక్ శోధ నాట్య అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో నాట్యాచార్య బద్రి నారాయణ నేతృత్వంలో ఈ జాతీయ స్థాయి కళా సమ్మేళన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఒడిస్సా రాష్ట్రాల నుంచి కళాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ ఐదు రాష్ట్రాల నుంచి మూడు రోజుల పాటు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిర్విరామంగా నిర్వహించిన పోటీల్లో మొత్తం 281 మంది కళాకారులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభను కనబర్చిన 100 మంది కళాకారులు వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. కూచిపూడి, భరతనాట్యం, క్లాసికల్ ఓకల్, సెమీ క్లాసికల్ ఓకల్, సెమీ క్లాసికల్ డ్యాన్స్, సెమీ క్లాసికల్ ఫోక్ డ్యాన్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థినులచే చతుషష్టి కళారూపాలుగా నృత్య సమ్మేళనం నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమాలకు అతిథులుగా ప్రముఖ సినీనటి కవిత, ప్రముఖ సినీగేయ రచయిత భువన చంద్ర హాజరయ్యారు. విజేతలకు ఆదివారం నిర్వహించిన సభలో ప్రముఖ సినీ గేయ రచయిత భువన చంద్ర బహుమతి ప్రదానం చేశారు. ఆచార్య రాజ్‌కుమార్ వడయార్, వి కోదండ రామారావు, నాట్య గురువుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అడ్డాల నాగేశ్వరరావు, ఏపీ భాషా సాంస్కృతిక శాఖ సీఈవో డాక్టర్ విజయ భాస్కర్ తదితరులు హాజరయ్యారు. ప్రముఖ నాట్యాచార్యులు కుషల్ భట్టాచార్య, యక్షగాన కంఠీరవ డాక్టర్ పసుమర్తి శేషుబాబు, ప్రముఖ నాట్యాచారిణి డాక్టర్ ఇందిరా హేమ న్యాయ నిర్ణేతగా వ్యవహించారు. శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వాహకులు డాక్టర్ బద్రి నారాయణ, జయశ్రీ డాక్టర్ కొమండూరి కళ్యాణ వేంకటేశ్వర స్వామిని ఘనంగా సత్కరించారు. పిబత భాగవతం రసమాలయం కార్యక్రమాన్ని అష్టావధాని డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి రస సమన్వయకర్తగా వ్యవహరించారు. శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థినులచే భారతీయ జానపద నృత్య రీతులతో జైకిసాన్ నృత్య రూపం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.