రాష్ట్రీయం

దోపిడీ వ్యవస్థ మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 24: మనం పాలకులం కాదు.. సేవకులమనేది అనుక్షణం గుర్తించాలి.. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాలి.. వారు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు.. ప్రజలకు ఏం కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితుల నుండి బయటపడాలి.. మార్పు మనతోనే ప్రారంభం కావాలి..దోపిడీ వ్యవస్థను మార్చాలనేదే ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదిక కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధి విధానాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు, విభాగాధిపతులు, కార్యదర్శులు, మంత్రులందరి దగ్గర ‘నవరత్నాలు’ విధిగా ఉండాలన్నారు. మేనిఫెస్టోలను చెత్తబుట్టలో వేసే సంస్కృతికి స్వస్తి చెప్పాలన్నారు. ప్రజలు మనపై నమ్మకం ఉంచారు.. మాకు అధికారం ఇచ్చారు.. నా ద్వారా మీకూ అంతే బాధ్యత ఉంటుంది.. ప్రభుత్వం మనది.. పై నుంచి కింది స్థాయి వరకు కలసికట్టుగా పనిచేస్తేనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలమన్నారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామనేది మరువ రాదన్నారు. కార్యాలయాలకు పనుల నిమిత్తం ఎమ్మెల్యేలు, ప్రజలు వస్తే చిరునవ్వుతో పలుకరించండి.. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించవద్దు.. దోచుకుందామని ఏ స్థాయిలో వారు చెప్పినా ప్రభుత్వం హర్షించదని స్పష్టం చేశారు. అవినీతి, లూటీ తప్ప మిగిలిన ఏ అంశంలో ఎమ్మెల్యేలు సలహాలు, సూచనలిచ్చినా.. ప్రజా సమస్యలను మీ దృష్టికి తెచ్చినా సానుకూలంగా స్పందించండి.. పారదర్శక పాలన అందించే విషయంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు రెండు కళ్లుగా వ్యవహరించాలని నిర్దేశించారు. కలెక్టర్లుగా మీరు మరువకూడని వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదలు, రైతులేనని స్పష్టం చేశారు. వారి స్థితిగతులు విస్మరించద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫలాలు అందకపోతే తప్పుచేసిన వాళ్లవుతాం.. ఈ వ్యవస్థలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం పెరగాలి.. వారి కోసమే ప్రతి అడుగని సీఎం జగన్ స్పష్టం చేశారు. అర్హులను కాదని ఏ పార్టీ వారు సిఫార్సు చేసినా తిరస్కరించాలన్నారు. ఎన్నికల తరువాత అంతా మనవారే అని గ్రహించాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు కోసం పారదర్శకత అనేది వర్తింప చేయాలి.. ఇందుకోసం విలేజ్ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టాం.. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాం.. వాలంటీర్లు తనకు నచ్చినా..నచ్చకపోయినా అర్హులకు పథకాలు అందించాల్సిందే అన్నారు. ఏదైనా తప్పు జరిగితే తక్షణమే వారిని తొలగించి మరొకరిని నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. దీన్ని పర్యవేక్షించేందుకు సీఎం కార్యాలయంలో కాల్ సెంటర్ పనిచేస్తుందన్నారు. అర్హులను కాదని ఎవరు చెప్పినా ఏ మాత్రం రాజీపడవద్దు.. నిజాయితీగా పనిచేయాలని ఉద్బోధించారు. ప్రతి అడుగులో పారదర్శకత కనిపించాలని ఆకాంక్షించారు. కాంట్రాక్టర్లు అంటేనే అవినీతి అనే పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించింది.. రాజధాని, సచివాలయ నిర్మాణం.. రహదార్లలో భారీగా అక్రమాలు జరిగాయి.. దీన్ని మార్చేందుకు పై నుంచి ప్రక్షాళన చేస్తున్నాం.. రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెస్తాం.. నాణ్యతా ప్రమాణాలు.. ఉత్తమ విలువలే ప్రభుత్వ లక్ష్యాలుగా చెప్పారు. చట్టం..న్యాయం..రాజ్యాంగం ఔపోసనపట్టి కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు.. ఓ ముఖ్యమంత్రిగా నేను చనిపోయాక నా ఫొటో అందరి ఇళ్లలో ఉండాలనేదే నా తాపత్రయం.. ఇందుకు సహకరించాలని కలెక్టర్లను కోరారు. స్నేహపూర్వక వాతావరణంలో అవినీతిరహిత పారదర్శక పాలన అందరి బాధ్యతన్నారు.

చిత్రం... కలెక్టర్ల సమావేశం