రాష్ట్రీయం

మేనిఫెస్టో అమలులో మొదటి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: వైకాపా మేనిఫెస్టో అమల్లో మొదటి అడుగు గ్రామ వలంటీర్‌తో ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉండవల్లి ప్రజావేదికలో సోమవారం ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ వివిధ పథకాల అమల్లో కలెక్టర్లు ఉదారతతో ఉండాలన్నారు. నాలుగు చక్రాల వాహనం ఉంటే వారికి పింఛను నిరాకరిస్తున్నారని, అటువంటి కేసులను పరిశీలించాల్సి ఉందన్నారు. ఆటోలు ఉన్న వారికీ పింఛన్లు ఇవ్వాలన్నారు. కార్లను అద్దెకు నడుపుతున్న వారికి పింఛన్ల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. బతికే ఆశ కల్పించే దిశగా వ్యవహరించాలి తప్ప, కఠిన నియమాలు వద్దని సూచించారు. బీదల విషయంలో కాస్త సానుకూలంగా ఉండాలన్నారు. తలసేమియా, కిడ్ని వ్యాధితో బాధపడే వాళ్లే కాకుండా పక్షవాతం, కుష్ఠువ్యాధిగ్రస్తులకూ నెలకు రూ. 10 వేల రూపాయల పింఛన్ ఇచ్చే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వైఎస్సార్ అభయ హస్తం కింద లబ్ధిదారులకు ఇచ్చే 500 రూపాయలు వాళ్లు చెల్లించిన డబ్బులే కదా అని ప్రశ్నించారు. అటువంటప్పుడు వారికి పింఛను నిరాకరించడం సరికాదని, వారికీ పింఛన్లు ఇవ్వాలన్నారు. వైఎస్సార్ అభయ హస్తం కింద పింఛన్లు ఇవ్వకుండా చేశారన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకురావాలి కదా అని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించగా, అధికారులు, మనం వేరు కాదని, అంతా ఒక జట్టుగా పని చేయాలని సూచించారు. అందరం కలిసి పనులు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. మనం ఇప్పుడు అధికారంలో ఉన్నామని, ప్రతిపక్షంలో లేమన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. అధికారులు తమ జట్టులో భాగమని గుర్తుంచుకోవాలని సూచించారు.
చిత్రం... కలెక్టర్ల సమావేశంలో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో, నవరత్నాలు చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్