రాష్ట్రీయం

రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూన్ 24: తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావు ప్రకటించారు. సోమవారం టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధుల నుద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం, చివరికు దేవుడితో తలపడటానికి సైతం వెనుకాడని నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ పార్టీని ప్రారంభించిన నాడు ఎవరూ ఊహించలేదని, రెండు సార్లు అధికారంలోకి రావ డం, వ్యవస్థీకృతమై, బలమైన, అజేయశక్తిగా టీఆర్‌ఎస్ పార్టీ ఎదుగుతుందని అనుకోలేదన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సభలో రికార్డు స్థాయిలో 45 లక్షల ఎకరాలకు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా పూర్తి చేశారని అబ్బుర పడ్డారన్నారు. కేసీఆర్ అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఎలా పరుగు పెట్టుస్తున్నాడో దేశం యావత్తు చూస్తోందన్నారు. పార్టీ అంటే ఇలా ఉండాలి, పార్టీని ఇలా తీర్చిదిద్దాలని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలవాలని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని 33 జిల్లాలో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులు, గోదావరి, కృష్టా జలాలు తేవడం, ఇంటింటికీ నీరు అందించడం, ఎద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ప్రజల వద్దకు చేరాలంటే పటిష్టమైన, సుశిక్షితులైన కార్యకర్తలతో సంస్థాగత నిర్మాణం జరగాలన్నదే కేసీఆర్ ఆలోచనగా కేటీఆర్ పేర్కొన్నారు. దేశ చరిత్రలో అన్ని ఎన్నికల రికార్డులను టీఆర్‌ఎస్ తిరగ రాసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో 75 శాతం సీట్లు, 50 శాతం ఓట్లు సాధించామని స్పష్టం చేశారు. తొమ్మిది ఎంపీ స్థానాలతో అగ్ర స్థానంలో ఉన్నామని, చరిత్రలో రికార్డును సృష్టిస్తూ రాష్ట్రంలోని 32కు 32 జడ్పీ స్థానాలు గెలుచుకుని జడ్పీలపై గులాబీ జెండా ఎగుర వేశామని చెప్పారు. 85 శాతం ఎంపీపీలు, 100 శాతం జడ్పీలు సాధించుకున్నామన్నారు. కార్యకర్తలుగా బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు నిర్మాణం దృఢంగా చేసుకోవాలన్నదే సీఎం ఆలోచన మేరకు భూమి పూజ జరుగుతోందన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు, టీఆర్‌ఎస్ పార్టీ ఉన్నంతకాలం తెలంగాణకు శ్రీరామరక్ష అని ఆయన ఉద్ఘాటించారు. గ్రామగ్రామాన ప్రతి గడపకు, ప్రతిగుండెకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే గోదావరి, కృష్ణా నీరు రావాలంటే కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకత్వంతోనే సాధ్యమన్నారు. ఇది ప్రజల్లోకి ఎంత లోతుగా పోతే ప్రతి ఇంటిలో, ప్రతి గుండెలో కేసీఆర్ ఫొటో పెట్టుకుని పూజించే రోజు వస్తుందన్నారు. అధినేత ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. రికార్డు స్థాయిలో కాళేశ్వరం పూర్తి చేసుకున్నామని, సీతారామ, పాలమూరు, దిండి పూర్తి చేసుకుంటామని, దసరాకు సిరిసిల్లకు గోదావరి నీరు తెచ్చే బాద్యత తనపై ఉందని, 260కి పైగా చెరువులు నింపే బాధ్యత తాను, రమేష్‌బాబు, ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పార్టీ కార్యకర్తలకు చాలా కార్యక్రమాలు చేసే ఆలోచన ఉందని, బీమాతో పాటు దశలవారీగా అన్ని సంక్షేమ కార్యక్రమాలతో కార్యకర్తలను ముందుకు తీసుకువస్తామన్నారు. ఈ సమావేశంలో వేములవాడ శాసనసభ్యుడు సిహెచ్. రమేష్‌బాబు మాట్లాడుతూ కేటీఆర్ జిల్లాకు వరమని, పార్టీపరంగా అభివృద్ది దృష్ట్యా ఢోకా లేదని, మనకు కేటీఆర్ ఉన్నాడని అన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఎంపీపీ జూపెల్లి శ్రీలత, నూతన ఎంపీపీ పడిగెల మానస రాజు, పట్టణ తెరాస అధ్యక్షుడు జిందం చక్రపాణి, కేడీసీసీబీ వైస్ చైర్మన్ ఉచ్చిడి మోహన్‌రెడ్డి, నాయకులు తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, పూసపల్లి సరస్వతి, గడ్డం నర్సయ్య, అకునూరి శంకయ్య, డి.లక్ష్మారెడ్డి, జూపెల్లి నాగేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...సభలో ప్రసంగిస్తున్న తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్