రాష్ట్రీయం

దక్షిణ మధ్య రైల్వేలో కొత్త అధిపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ఆదాయం వైపు దృష్టిపెట్టారు. జోన్‌ను ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి అనుభవం ఉన్న అధికారులను ఆయా విభాగాలకు అధిపతులుగా నియమించింది.
ముఖ్యంగా ఆపరేషన్, కమర్షియల్ విభాగాల నుంచి ఎక్కువ ఆదాయాన్ని మెరుగుపర్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ద.మ. రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్‌గా కె. శివప్రసాద్‌ను నియమించారు. కమర్షియల్ చీఫ్ మేనేజర్‌గా జి. జాన్ ప్రసాద్‌ను నియమించారు. శివప్రసాద్‌కు పలు జోన్లలలో పని చేసిన అనుభవం ఉంది. అలాగే జాన్ ప్రసాద్ కర్నాటక హుబ్లీ, సౌత్ వెస్ట్రన్ రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ మేనేజర్‌గా పని చేసిన అనుభవం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
చిత్రాలు.. జాన్ ప్రసాద్ ( కమర్షియల్ చీఫ్ మేనేజర్) *శివప్రసాద్ (ప్రిన్సిపల్ చీఫ్ మేనేజర్)