రాష్ట్రీయం

టీచర్ల సర్వీసు రూల్స్‌కు ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు కేంద్ర న్యాయ శాఖ అనుమతి ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. సర్వీసు రూల్స్‌కు కేంద్ర హోం శాఖ, రాష్టప్రతి కార్యాలయం నుండి కూడా సానుకూలంగా ఆమోదం లభిస్తుందనే ఆశాభావాన్ని సిసోడియా వ్యక్తం చేశారు. మరోవైపు ఎంఇఓ పోస్టులను ప్రధానోపాధ్యాయులతో బదిలీ ద్వారా భర్తీ చేయుటకు జిఎడి అనుమతి ఇచ్చిందని త్వరలో దీనిపై ఉత్తర్వులు ఇప్పిస్తామని ముఖ్యకార్యదర్శి తెలిపారు. ఎయిడెడ్, స్పౌస్‌లకు అంతర్ జిల్లా బదిలీలకు అనుమతించాలని, రేషనలైజేషన్, నెలవారీ పదోన్నతుల వల్ల పాఠశాల మారినా జిల్లాలో మొత్తం సర్వీసు రెండేళ్లు నిండినందున వీరిని కూడా అంతర్ జిల్లా బదిలీ చేయడానికి జిఎడి అనుమతికి వెంటనే ఫైలు పంపించాలని, ఒకేసారి అందరికీ బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలని ముఖ్యకార్యదర్శిని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు ఐ వెంకటేశ్వరరావు, శాసనమండలి సభ్యుడు బి నాగేశ్వరరావులు కోరారు. పండిట్స్, పిఇటిల అప్‌గ్రెడేషన్‌కు అనుమతి ఇప్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం జాయింట్ సెక్రటరీ పిఎస్ ప్రద్యుమ్న గారిని కోరినట్టు సిసోడియా తెలిపారు. ఎయిడెడ్ రేషనలైజేషన్, ప్రమోషన్స్ నియామకాలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని యుటిఎఫ్ నేతలు కోరారు.
మెడికల్ రీయింబర్స్‌మెంట్ గడువు పొడిగించాలి
ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ గడువు మార్చి 31తో ముగిసినందున సెప్టెంబర్ 2016 వరకూ మరో ఆరు నెలలు పొడిగించాలని ఎపిజెఎసి చైర్మన్ పి అశోక్‌బాబు, సెక్రటరీ జనరల్ ఐ వెంకటేశ్వరరావులు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్‌ను కోరారు.
పరీక్షల సిబ్బంది భత్యం పెంపు
పరీక్షల సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది భత్యం పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్లర్కులు, జూనియర్ అసిస్టెంట్లుకు రోజుకు 80 రూపాయిలు ఇస్తుండగా దానిని 88 రూపాయిలకు పెంచారు. అలాగే ఆఫీసు సబార్డినేట్‌లకు రోజుకు 50నుంచి 55 రూపాయిలకు పెంచారు.

కమలానాథన్ కమిటీ
ఎదుట టి.ఉద్యోగుల ధర్నా
తమను ఏపికి కేటాయించవద్దని డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టిన కమలానాథన్ కమిటీ ఎదుట బుధవారం సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగుల విభజనపై కసరత్తు చేస్తున్న కమిటీ బుధవారం తెలంగాణ సచివాలయంలో వివిధశాఖలతో సమావేశమైంది. తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా (ఎఎస్‌ఓ) పని చేస్తున్న 67 మంది ఉద్యోగులు తమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడాన్ని నిరసిస్తూ కమలానాథన్ కమిటీ ఎదుట ధర్నాకు దిగింది. తమకు తెలంగాణ ప్రభుత్వంలోనే కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులతో సాధారణ పరిపాలనా సర్వీస్ మేటర్ కార్యదర్శి వెంకటేశ్వర్‌రావు సమావేశమై ఎవరికి అన్యాయం జరుగకుండా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.