రాష్ట్రీయం

ఓపెన్ వర్శిటీ అర్హత పరీక్షలో 13,385 మంది ఉత్తీర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ఎలాంటి విద్యార్హత లేకుండా నేరుగా డిగ్రీలో చేరేందుకు అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ నిర్వహించిన అర్హత పరీక్షలో 13385 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 16న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను మంగళవారం నాడు విడుదల చేశారు. 17512 మంది పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 13385 మంది ఉత్తీర్ణులయ్యారని, ఇందులో 193 మంది ఖైదీలు కూడా ఉన్నారని వర్శిటీ అధికారులు తెలిపారు. వీరంతా రాష్ట్రంలోని వివిధ కేంద్ర కారాగారాల్లో శిక్షను అనుభవిస్తున్నారని వర్శిటీ అధికారులు పేర్కొన్నారు.